Team Tarak Trust: తారక్ అభిమానుల ఔదార్యం.. హోమ్ క్వారంటైన్ వారికి సాయం!

కరోనా సెకండ్ వేవ్ మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతుంది. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఆర్థిక కష్టాలు.. ఉపాధితో ప్రజలు అల్లాడిపోతే.. ఇప్పుడు సెకండ్ వేవ్ లో లాక్ డౌన్ లేదు కానీ మహమ్మారి మరింత జఠిలంగా మారి ప్రజల జీవితాలతో ఆడేసుకుంటుంది.

Team Tarak Trust: తారక్ అభిమానుల ఔదార్యం.. హోమ్ క్వారంటైన్ వారికి సాయం!

Team Tarak Trust

Team Tarak Trust: కరోనా సెకండ్ వేవ్ మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతుంది. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఆర్థిక కష్టాలు.. ఉపాధితో ప్రజలు అల్లాడిపోతే.. ఇప్పుడు సెకండ్ వేవ్ లో లాక్ డౌన్ లేదు కానీ మహమ్మారి మరింత జఠిలంగా మారి ప్రజల జీవితాలతో ఆడేసుకుంటుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది రికార్డు కేసులతో పాటు ఆసుపత్రులలో బెడ్లు దొరకక.. ఆక్సిజన్ సరిపోక నానాయాతన అనుభవిస్తున్నారు. చివరికి స్మశానంలో కూడా ఖాళీలు లేక క్యూలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కరోనా కాలంలో సాయమందిస్తున్నాయి.

మన తెలుగు రాష్ట్రాలలో కూడా పలు ట్రస్టులు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు కూడా కరోనా రోగులకు సాయమందించేందుకు ముందుకొచ్చాయి. తారక్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించే ఈ సంస్థ చాలా కాలంగా పలు సందర్భాలలో సాయం అందించగా ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లో ఉన్న కోవిడ్ రోగులకు సాయం చేయడానికి ముందుకొచ్చింది. హోమ్ క్వారంటైన్ లో ఉండే వారు ఆహారం విషయంలో పలు ఇబ్బందులకు గురి అవుతుంటారు. అందుకే తారక్ ట్రస్ట్ చేయూత నిచ్చేందుకు ముందుకొచ్చింది.

హోమ్ క్వారంటైన్ సమయంలో తిరుపతి చుట్టుపక్కల ఎవరైనా ఆహారం దొరక్క ఇబ్బంది పడుతుంటే.. దయచేసి..టీమ్ తారక్ ట్రస్ట్ వారికి ఫోన్ చేయండి.. మీకు ఆహారాన్ని అందిస్తారని ప్రకటన ఇచ్చి.. కింద తమ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అవుతుండగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న కోవిడ్ పేషేంట్లకు ఇది ఉపయోగకరమైనదిగా సోషల్ మీడియాలో నెటిజన్లు కొనియాడుతున్నారు. కాగా, ఇది ఒక్క తిరుపతి చుట్టుపక్కల మాత్రమే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ సేవను కొనసాగించేలా హీరోలు ముందుకొస్తే తెలుగు ప్రజలకు మరింత మేలు జరుగుతుందని నెటిజన్లు కోరుతున్నారు.