Telugu States By-poll: నేడు తేలనున్న హుజురాబాద్, బద్వేల్ నేతల భవితవ్యం
తెలుగు రాష్ట్రాలలో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరగనుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నేతల భవితవ్యం నేడు తేలనుండగా.. ఏపీలోని..

Telugu States By-poll: తెలుగు రాష్ట్రాలలో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరగనుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నేతల భవితవ్యం నేడు తేలనుండగా.. ఏపీలోని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు కూడా నేడే వెలువడనున్నాయి. మరికాసేపట్లో.. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో హుజురాబాద్ స్థానానికి కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ఓట్లు నిక్షిప్తమైన ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో నుంచి కౌంటింగ్ హాల్లోకి తరలించారు.
ముందుగా 8 గంటలకు 753 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలు పెట్టనున్న అధికారులు.. 8.30కి ఈవీఎంల కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియలో మొత్తం 14 టేబుల్స్.. 22 రౌండ్స్ లో లెక్కింపు పూర్తి చేయనున్నారు. ముందుగా హుజురాబాద్ మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్న అధికారులు.. మొదటి పోలింగ్ స్టేషన్ పోతిరెడ్డి పేట కాగా చివరగా శంబునిపల్లి పోలింగ్ బూత్ ఈవీఎంను లెక్కించనున్నారు. కౌంటింగ్ సందర్భంగా కరీంనగర్-జగిత్యాలకు ట్రాఫిక్ మల్లింపు చేపట్టారు.
మరోవైపు మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలోని కడప జిల్లా.. బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. పట్టణ శివార్లలోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉండగా.. ప్రధానంగా వైసీపీ బీజేపీ మధ్య పోటీ నెలకొనగా.. నాలుగు కౌంటింగ్ హాల్స్ లో 28 టేబుళ్ల ఏర్పాటు చేశారు. కౌంటింగ్ మొదలైతే మూడు, నాలుగు గంటల్లోనే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది.
తోలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలు పెట్టనుండగా.. మొత్తం 914 పోస్టల్ బ్యాలెట్స్ కు గాను 235 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ లో 249 మంది సిబ్బంది పాల్గొననుండగా.. మొత్తం ఓట్లు 2,15, 292కు గాను.. మొత్తం పోలైన ఓట్లు 1, 46, 660. ఒకవైపు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుండగా.. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. కౌంటింగ్ కు వర్షం ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేసిన అధికారులు కేంద్ర పారా మిలటరీ దళాల తో పాటు నాలుగు వందల మందిపోలీసులుతో భద్రత ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్ కేంద్రానికి సమీపంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
- Telangana : ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే..మా పరిస్థితి ఏంటీ అంటూ టీ.కాంగ్రెస్ నేతల డైలమా..ఎందుకంటే..?
- Jagga reddy : బీజేపీ కేంద్ర కమిటీ డైరెక్షన్లో టీఆర్ఎస్ నడుస్తోంది.. యాసంగిలో వరిసాగు చేయని రైతులకు పరిహారం ఇవ్వాలి
- Kadapa : వర్క్ చేస్తుండగా పేలిన ల్యాప్ టాప్, సాప్ట్ వేర్ ఇంజినీర్లు జాగ్రత్త
- తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
- టీఆర్ఎస్, బీజేపీ మధ్య లేఖల పర్వం..!
1NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
2Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
3CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
4RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
5IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
6Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
7IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
8Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
9Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
10Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
-
Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య