CJI NV Ramana : మీ ప్రేమాభిమానం ఎన్నటికీ మరువను – సీజేఐ ఎన్వీ రమణ

ఏపీలో కాలు మోపినప్పటి నుంచి లభించిన ఆదరాభిమానాలు.. ప్రేమాభిమానాలతో ముంచెత్తిన తీరును నేను నా కుటుంబసభ్యులు ఎన్నటికీ మరువలేము అన్నారు.

CJI NV Ramana : మీ ప్రేమాభిమానం ఎన్నటికీ మరువను – సీజేఐ ఎన్వీ రమణ

Cji Nv Ramana

CJI NV Ramana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన మూడు రోజుల పర్యటనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో కాలు మోపినప్పటి నుంచి లభించిన ఆదరాభిమానాలు.. ప్రేమాభిమానాలతో ముంచెత్తిన తీరును నేను నా కుటుంబసభ్యులు ఎన్నటికీ మరువలేము అన్నారు. బంధుత్వాల కంటే మిత్ర బంధానికే పెద్ద పీట అన్నారు. పొన్నవరం.. ఊరు ఊరంతా నా కోసం తరలి రావడం ఆనందంగా ఉందన్నారు.

తన స్వగ్రామం పొన్నవరం వీధుల్లో నడుస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా అపూర్వ స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్‌, సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. తేనీటి విందుకు హాజరైన పెద్దలు, ప్రముఖులు, మంత్రులు, అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

SBI Jobs : ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. అప్లయ్ చేసుకున్నారా?

బెజవాడ బార్‌ అసోసియేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌, ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం, రోటరీ క్లబ్‌ వంటి సంస్థలు నన్ను.. నా భార్యను సత్కారాలతో ముంచెత్తాయన్నారు. లావు వెంకటేశ్వరరావు స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్వీ రమణ. న్యాయ వ్యవస్థ పట్ల, న్యాయమూర్తుల పట్ల తెలుగు ప్రజలు చూపిన గౌరవానికి తోటి న్యాయమూర్తులు ఎంతో సంతోషించారని అన్నారు. తన పర్యటన సాఫీగా సాగేందుకు ప్రత్యేక శ్రద్ద చూపిన సీఎం జగన్ కు, మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీజేఐ ఎన్వీ రమణ. కాగా, సమయాభావం వల్ల ఎంతో మందిని కలవలేకపోయానని, మరోసారి కలిసే అవకాశం వస్తుందని భావిస్తున్నా అని చెప్పారు.

Major Financial Works : డిసెంబర్ 31లోగా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే నష్టపోతారు..

ఎన్వీ రమణ మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సొంత ఊరిలో పర్యటించారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరంలో అడుగుపెట్టారు. ఎన్వీ రమణకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. సీజే దంపతులను ఎడ్ల బండిపై ఊరేగింపుగా మేళతాళాలతో గ్రామంలోకి తీసుకెళ్లారు. పొన్నవరంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎన్వీ రమణ. అనంతరం గ్రామస్థులు పౌరసన్మాన కార్యక్రమం నిర్వహించారు.