AP High Court : సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా వదిలేస్తే రేపు తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారని కోర్టు తెలిపింది.

AP HIGH COURT
AP High Court : సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా వదిలేస్తే రేపు తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారని కోర్టు తెలిపింది. ఐఏఎస్ అధికారులుండగా శాఖలకు సలహాదారులు ఎందుకని కోర్టు ప్రశ్నించింది.
సలహాదారుల నియామకంపై రాజ్యాంగబద్దతను తేలుస్తామని స్పష్టం చేసింది. సలహాదారుల పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శ్రీకాంత్ పై గతంలో విధించిన స్టే ఉత్తర్వులను సవరించింది.
సలహాదారుగా కొనసాగేందుకు శ్రీకాంత్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ విషయంపై హైకోర్టు ఎలాంటి తీర్సు ఇస్తుందో చూడాలి మరి.