స్వీటీ నువ్వు గ్రేట్ : ఒకే ఈతలో 18 మంది పిల్లలకు జననం

  • Published By: madhu ,Published On : November 12, 2020 / 11:25 AM IST
స్వీటీ నువ్వు గ్రేట్ : ఒకే ఈతలో 18 మంది పిల్లలకు జననం

Dane Breed dog : ఒకే ఈతలో గ్రేట్ డాని బ్రీడ్ కు చెందిన కుక్క (స్వీటి) 18 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకూర పాడు మండలం లగడపాడులో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో వట్టికూటి సైదారావు కుటుంబం నివాసం ఉంటోంది. కుక్కలను పెంచుకుంటున్నాడు. గ్రేట్ డాని బ్రీడ్ కు చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నాడు.



తొలి ఈతలో 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. బుధవారం రెండోసారి 08 పిల్లలకు జన్మనివ్వడం విశేషం. మొత్తం 18 మంది. అందులో 11 ఆడ, 7 మగ పిల్లలున్నాయి. అన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు పశు వైద్యాధికారి కోమటినేని రాఘవయ్య వెల్లడించారు. ఒకే ఈతలో 18 పిల్లలు పుట్టడం చాలా అరుదని, సూపర్ ఓవలేషన్ కారణంగా ఇలా జరుగుతుందని వెల్లడించారు.