ఏపీ మీదుగా వెళ్లే ఇండస్ట్రియల్‌ కారిడార్లపై కేంద్రం క్లారిటీ

ఏపీ మీదుగా వెళ్లే ఇండస్ట్రియల్‌ కారిడార్లపై కేంద్రం క్లారిటీ

the industrial corridors that run through the AP : ఏపీ మీదుగా వెళ్లే ఇండస్ట్రియల్‌ కారిడార్లపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎంపీ జీవీఎల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాచారం ఇచ్చింది. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ వివరాలను వెల్లడించింది. ఈ కారిడార్‌తో శ్రీకాళహస్తి, విశాఖ, కడపల్లో పరిశ్రమలకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో పాటు చెన్నై -బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కింద కృష్ణపట్నంలో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.

హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌ కింద ఓర్వకల్లులో పరిశ్రమలకు అవకాశం ఉంది. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కింద 1.8లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. దీంతో పాటు చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కింద 98వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి.

ఎగుమతులే లక్ష్యంగా తయారీరంగ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. కృష్ణపట్నంలో ట్రక్కుల తయారీ పరిశ్రమకు కేంద్రం 2వేల 139 కోట్లు కేటాయిస్తోంది. విశాఖ-చెన్నై కారిడార్‌తో జీడీపీ 6రెట్లు పెరుగుతుందన్న అంచనాలున్నాయి. 11,600 బిలియన్ల టర్నోవర్‌ జరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

చిత్తూరులో ఏర్పాటు చేసే నిమ్జ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాచారం లేదని కేంద్రం చెబుతోంది. అందుకే అత్యున్నతస్థాయి కమిటీ తుది అనుమతులు ఇవ్వలేదన్నారు. భూమి సేకరించి బదిలీ చేయాలని కోరినా పెద్దగా పురోగతి లేదని కేంద్రం అంటోంది.