Tirupati by Poll : తిరుపతి ఉప ఎన్నిక, గెలుపు ఎవరిది..అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Tirupati by Poll : తిరుపతి ఉప ఎన్నిక, గెలుపు ఎవరిది..అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

Tpt By Poll

file nominations : తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వైసీపీ, బీజేపీ, సీపీఎం అభ్యర్థులు నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, అనిల్ కుమార్, గౌతం రెడ్డి, కొడాలి నానిలతో కలిసి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నామినేషన్ వేశారు. బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ కూడా నామినేషన్ పత్రాలు సమర్పించారు. నెల్లూరులో కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు. ఇప్పటికే నామినేషన్ వేసిన టీడీడీ అభ్యర్థి పనబాక లక్ష్మి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా చింతామోహన్‌ సాదాసీదాగా నామినేషన్‌ దాఖలు చేశారు.

ఉప ఎన్నికలో ఎలాగైనా పట్టు సాధించాలని.. ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. సిట్టింగ్ సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలని వైసీపీ పట్టుదలగా ఉంది. నియోజకవర్గానికి ఒక మంత్రి చొప్పున ప్రచార బాధ్యతలను అప్పజెప్పింది. ఏపీ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరుమీదున్న వైసీపీ తమ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని టార్గెట్ పెట్టుకుంది. తన స్వగ్రామం మన్న సముద్రంలో ప్రచారం నిర్వహించారు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి. వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమమే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వరుస ఓటములతో నిరాశలో ఉన్న టీడీపీ తిరుపతి ఉప ఎన్నిక గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీలో కీలకంగా ఉన్న వారందరినీ ప్రచారంలోకి దింపాలని భావిస్తోంది. ఇక బీజేపీ కూడా ప్రచార జోరు పెంచింది. విద్యావంతులు, మేధావులతో భేటీలు నిర్వహిస్తున్నారు. రత్నప్రభ గెలిస్తే మంత్రి పదవి కూడా దక్కుతుందని ప్రచారం చేస్తున్నారు. తిరుపతి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఓటర్లను తమవైపు తిప్పుకునే వ్యూహంతో ముందుకెళుతున్నారు. రత్నప్రభ తరఫున జనసేన ప్రచారానికి సిద్దమైంది. ఏడు నియోజకవర్గాల్లో ప్లాన్ చేసింది. వచ్చే వారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో పాల్గొననున్నారు.

Read More : Nagarjuna Sagar bypoll : సాగర్ బై పోల్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు