Physiotherapist M.Gurumoorthy : తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ.. డాక్టర్ గురుమూర్తి ఎవరంటే?

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. గురుమూర్తి పేరును అధికారికంగా వైసీపీ ప్రకటించింది. డాక్టర్ మడిలా గురుమూర్తి పేరును ఏపీ సీఎం జగన్ ఖరారు చేశారు.

Physiotherapist M.Gurumoorthy : తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ.. డాక్టర్ గురుమూర్తి ఎవరంటే?

Physiotherapist M.gurumoorthy Name (1)

Physiotherapist M.Gurumoorthy : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థి పేరు ఖరారు అయింది. గురుమూర్తి పేరును అధికారికంగా వైసీపీ ప్రకటించింది. డాక్టర్ మడిలా గురుమూర్తి పేరును ఏపీ సీఎం జగన్ ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన పేరును ఫైనల్ చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం (మార్చి 16, 2021) ప్రకటన విడుదల చేసింది. ఇంతకీ ఈ గురుమూర్తి ఎవరంటే? శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని యెర్పెడు మండల మన్నసముద్రం గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందినవారు.

గురుమూర్తి తల్లీదండ్రులు చదువుకోలేదు. అయినప్పటికీ, ఆయన్ను డాక్టర్ ను చేసేందుకు ఎంతో శ్రమించారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో గురుమూర్తి బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ అండ్ సర్టిఫైడ్ మాన్యువల్ థెరపీ పూర్తి చేశారు. సి నవ్య కిరణ్‌ను వివాహం చేసుకోగా.. దంపతులకు ఒక పాప, బాబు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హిందూ కుటుంబానికి చెందిన గురుమూర్తి మిగతా అన్ని కులాలకు, వర్గాలకు ప్రాముఖ్యత ఇచ్చేవారు. సమాజ శ్రేయస్సు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? మంచి పౌరుడిగా ఎలా ఉండాలో ఆయనకు తల్లిదండ్రులు నేర్పించారు.

SVIMIS యూనివర్శిటీలో ఫిజియోథెరపీ చదువుతున్నప్పుడు 2006 నుంచి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన అనుచరుడిగా ఉన్నారు. గతంలో ఆయన ఫిజియోథెరపీ SVIMS యూనివర్శిటీ ప్రవేశ పరీక్షలో 56వ ర్యాంకు సాధించారు. అలాగే మాన్యువల్ థెరపీలోనూ అర్హత సాధించారు. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదువుతూనే విద్యార్థులకు నేతృత్వం వహించారు. ఎపి స్టేట్ ఫిజియోథెరపీ కౌన్సిల్ స్థాపించడానికి రాజశేఖర్ రెడ్డితో అనేక సార్లు కలిశారు.

అప్పటినుంచి గురుమూర్తి రాజశేఖర్ రెడ్డికి బలమైన అనుచరుడు అయ్యారు. ఆ రోజు నుంచి గురుమూర్తి తన జీవితాంతం వైయస్ఆర్ అనుసరించాలని నిర్ణయించుకున్నారు. అలా వైయస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా మారారు. వైసీపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. 2014 ఎన్నికల ప్రచారానికి టీమ్ సభ్యునిగా బాధ్యతను స్వీకరించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజ సంకల్ప యాత్ర సమయంలో మొత్తానికి ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేయడానికి గురుమూర్తికి అవకాశం దక్కింది.