Youtubeలో చూసి నాటుసారా తయారీ, బీటెక్ బాబు అరెస్ట్, తన టాలెంట్‌ని ఇలా వాడుకున్నాడు

  • Published By: naveen ,Published On : September 12, 2020 / 04:28 PM IST
Youtubeలో చూసి నాటుసారా తయారీ, బీటెక్ బాబు అరెస్ట్, తన టాలెంట్‌ని ఇలా వాడుకున్నాడు

తిరుపతి నగరంలోని పద్మావతి మహిళా యూనివర్శిటీ సమీపంలో ఓ ఇంట్లో నాటు సారా తయారు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి నాటుసారా తయారుచేసి అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను అద్దెకు ఉంటున్న ఇంట్లో 70 లీటర్ల నాటు సారా, 400 లీటర్ల ఊటతో పాటు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడు ఉపయోగించిన ల్యాప్‌టాప్‌ను కూడా సీజ్ చేశారు.

మలేషియాలో బిజినెస్ కూడా చేశాడు:
చిత్తూరు జిల్లా పాకాల మండలం తోటపల్లి గ్రామంలో వంశీకృష్ణారెడ్డి అనే యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. ఆ తరువాత ఓ ప్రైవేట్ కంపెనీతో ఫ్రీ లాన్సర్‌గా పనిచేస్తూ.. మలేషియా వెళ్లి బిజినెస్ పెట్టాడు. అయితే అక్కడ లాస్ రావడంతో తిరిగి స్వదేశానికి వచ్చాడు.


https://10tv.in/sonu-sood-offers-scholarship-to-underprivileged-students/
ఈజీ మనీ కోసం అడ్డదారి:
అప్పటికే తన కుటుంబం అప్పుల పాలు కావడంతో.. ఈ దొంగ దారిని ఎంచుకున్నాడు. పద్మావతి మహిళా యూనివర్శిటీ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని.. చాలా టెక్నిక్‌గా నాటుసారా తయారుచేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా వాటిని అక్రమంగా సరఫరా చేశాడు. చివరికి పోలీసులు పట్టుకోవడంతో తప్పు చేశానని అంగీకరించాడు.