Tiruppavai : తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పావై

తిరుమల  శ్రీ వేంకటేశ్వర స్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సంద‌ర్బంగా తిరుమలలోని శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం జరుగుతోంది

Tiruppavai : తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పావై

Tiruppavai in Pedda jeeyar Mutt

Tiruppavai : తిరుమల  శ్రీ వేంకటేశ్వర స్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సంద‌ర్బంగా తిరుమలలోని శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం జరుగుతోంది.  డిసెంబర్ 16 నుంచి ,  జ‌న‌వ‌రి 14,  2022   వ‌ర‌కు ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌ుతుంది. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్ర‌తిపాదించిన  భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యుల  కాలంలో తిరుమ‌ల‌లో పెద్ద‌జీయర్ మఠం ఏర్పాటైంది.
Also Read : Chandrababu Naidu : భావితరాల భవిష్యత్ కోసం ఒకే రాజధాని ఉండాలి
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల ప‌రంప‌ర‌లో వ‌స్తున్న జీయ‌ర్‌స్వాములు తిరుమల శ్రీ‌వారి ఆల‌య కైంక‌ర్యాలు, సేవ‌లు, ఉత్స‌వాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ తిరుమల పెద్ద‌జీయ‌ర్‌స్వామి,  శ్రీ‌శ్రీ‌శ్రీ తిరుమల చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఇత‌ర పండితులు పాల్గొన్నారు.