స్వచ్ఛంధ లాక్ డౌన్ పాటిస్తున్న గిరిజనులు..విశాఖ ఏజెన్సీలో మ.1గంట వరకే షాపులు

  • Published By: nagamani ,Published On : June 25, 2020 / 10:11 AM IST
స్వచ్ఛంధ లాక్ డౌన్ పాటిస్తున్న గిరిజనులు..విశాఖ ఏజెన్సీలో మ.1గంట వరకే షాపులు

ఏపీలోని విశాఖపట్నం జిల్లాలోని గిరిజన గ్రామాలు కరోనా మహమ్మారి భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. కరోనా కలకలంతో గిరిజన ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో స్వచ్ఛంధంగా లాక్ డౌన్ పాటించాలని వర్తక సంఘాలునిర్ణయించాయి. దీంతో మధ్యాహ్నం 1గంట వరకే షాపులు తెరవాలని ఆతరువాత షాపుల్నీ మూసివేయాలని నిర్ణయించాయి. 

కరోనా భయంతో కొత్తవారినెవరినీ గ్రామాల్లోకి అడుగు పెట్టనివ్వటంలేదు. చింతపల్లి,జీకే వీశి,కొయ్యూరు మండలాల్లో  రహదారులపై పెద్ద్ పెద్ద చెట్లను నరికి దారికి అడ్డంగా వేశారు. కరోనా భయంతో వారాంతపు సంతలను కూడా జరపొద్దని అధికారులు స్థానికులకు సూచించారు. దీంతో గిరిజన గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. మనుషులెవ్వరుబైట తిరగటంలేదు. అన్ని బంద్ అయ్యాయి. నిర్ణయించిన సమయంలోనే నిత్యవసర వస్తువులుతెచ్చుకున్ని ఇళ్లకు పరిమితమవుతున్నారు గిరిజనులు. 

Read: ఈ ఏడాదిలో పూర్తి కావాల్సిన 6 ప్రధాన సాగు నీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష