Chinna Jeeyar: తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో త్రిదండి చిన్న జీయర్ స్వామి
తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి త్రిదండి చిన్న జీయర్ స్వామి వెళ్లారు. అనంతరం తిరుమల చేరుకున్న చినజీయర్ స్వామి.. తిరుమల కొండపై మై హోమ్ గ్రూపు నిర్మించిన అతిథి గృహాన్ని సందర్శించి, దానికి పద్మప్రియ అతిథి గృహంగా నామకరణం చేశారు.

Tridandi Chinna Jeeyar Swamy in Tiruchanur Padmavati Goddess Seva
Chinna Jeeyar: తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి త్రిదండి చిన్న జీయర్ స్వామి వెళ్లారు. అనంతరం తిరుమల చేరుకున్న చినజీయర్ స్వామి.. తిరుమల కొండపై మై హోమ్ గ్రూపు నిర్మించిన అతిథి గృహాన్ని సందర్శించి, దానికి పద్మప్రియ అతిథి గృహంగా నామకరణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి పూర్వసంధ్యలో ఈ కార్యక్రమం జరగడం సంతోషకరమని అన్నారు. భక్తులకు సేవలందించాలనే ఉద్దేశంతో మై హోం గ్రూప్ ఈ అతిథి గృహాన్ని నిర్మించి శ్రీవారికి సమర్పిస్తోంది. చినజీయర్ వెంట వెంట టీటీడీ పాలకమండలి సభ్యులు, మై హోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు వెళ్లారు.
TTD Chairman: తిరుమలకు వచ్చే వీఐపీలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అసంతృప్తి