TTD: ఆర్జిత సేవ టికెట్ల ధరలు భారీగా పెంచిన టీటీడీ!
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలను పెంచనుంది తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి.

Ttd Temple
TTD: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలను పెంచనుంది తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి.
శ్రీవారి ఆర్జిత సేవలు పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్న టీటీడీ.. సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుంది.
సుప్రభాతం రూ.2 వేలు, తోమాల, అర్చన రూ.5 వేలు, కళ్యాణోత్సవం రూ.2500, వేద ఆశ్వీరవచనం 10 వేలు, వస్త్రాలంకరణకు లక్ష రూపాయలు టిక్కెట్లుగా నిర్ణయించింది పాలకమండలి.
అన్నమయ్య నడకమార్గాన్ని కూడా నడకమార్గంగా అభివృద్ధి చేయాలని టీటీడీ తీర్మానం చేసింది. అదేవిధంగా అలిపిరి వద్ద ఆధ్యాత్మిక సిటీ నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది టీటీడీ.