Telugu States Rains : తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా అకాల వర్షాలు.. ఈదురుగాలులు, వడగళ్లకు దెబ్బతిన్న పంటలు

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా అకాల వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ప్రస్తుతం ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు, వడగళ్లుకు పంటలు దెబ్బతింటున్నాయి.

Telugu States Rains : తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా అకాల వర్షాలు.. ఈదురుగాలులు, వడగళ్లకు దెబ్బతిన్న పంటలు

Telugu States Rains : తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా అకాల వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ప్రస్తుతం ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు, వడగళ్లుకు పంటలు దెబ్బతింటున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వాన పడింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది.

హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, తాండూరు పరిసరాల్లో వడగళ్ల వాన పడింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో భారీగా వర్షం కురిసింది. భారీగా వీస్తున్న ఈదురు గాలులకు రోడ్ల వెంట ఉన్న హోర్డింగ్స్, రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. నియోజకవర్గంలోని పలు మండలాల్లో సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వర్షానికి జగిత్యాల జిల్లాలో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

Rains In Telangana: తెలంగాణలో మూడు రోజుల పాటు వానలు

ఈదురు గాలులకు రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. జగిత్యాల టవర్ సర్కిల్ కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్, గంజ్ రోడ్డు ప్రాంతంలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వడగళ్ల వల్ల నష్టంపై నివేదిక ఇవ్వాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ కోరారు. మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో వడగళ్ల వానతో భారీగా నష్టం జరిగింది.

వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టపోయిన రైతుల వివరాల జాబితా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. అటు ఏపీలో అకాల వర్షాలు రైతులకు నష్టాలు తెస్తున్నాయి. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో వడగళ్ల వానకు మిరప, జొన్న పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు వంద ఎకారల్లో మిరప, 50 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బితినడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు.