మహేష్ బాబుపై వర్ల రామయ్య ప్రశంసలు

  • Published By: vamsi ,Published On : June 25, 2020 / 05:58 AM IST
మహేష్ బాబుపై వర్ల రామయ్య ప్రశంసలు

తెలుగుదేశం పార్టీ సినియర్ నాయకులు వర్ల రామయ్య సినిమా హీరో మహేష్ బాబుపై ప్రశంసలు కురిపించారు. తూర్పు గోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్ భార్య నాగజ్యోతి కొన్ని రోజుల క్రితం ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది.

అయితే, ఆ చిన్నారికి అరుదైన గుండె జబ్బు ఉండడంతో ఆమె శరీరంలో చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మహేశ్ బాబు ఆమెకు కావాల్సిన చికిత్స కోసం ఆర్థిక సాయం చేశారు.

ఆ విషయం తెలుసుకున్న వర్ల రామయ్య.. ‘ఒక పేద బాలిక గుండె ఆపరేషన్‌కు ఆర్థిక సాయం చేసి చిన్నారి ప్రాణం కాపాడిన హీరో శ్రీ మహేష్ బాబుకు నా మనఃపూర్వక అభినందనలు.

ఈ సాయం మీకు చిన్నది కావచ్చు. కానీ, ఆ తలిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు తీరని మనోవేదనను తప్పించింది. మీకు, మీ కుటుంబానికి దేవుడు తోడుంటారు’ అంటూ ఆయనను ప్రశంసించారు. 

Read:  సేవలకు సలాం : లోనావాలా మ్యూజియంలో సోనూసూద్ మైనపు విగ్రహం