Varla Ramaiah : జూ.ఎన్టీఆర్ సంబంధం లేకపోతే సినిమా ప్రయత్నాలు ఎందుకు?

ఏపీలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారస్థాయికి చేరాయి.

Varla Ramaiah : జూ.ఎన్టీఆర్ సంబంధం లేకపోతే సినిమా ప్రయత్నాలు ఎందుకు?

Varla Ramaiah

Varla Ramaiah : ఏపీలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారస్థాయికి చేరాయి. తాగాజా ఈ వ్యవహారంలోకి జూ.ఎన్టీఆర్ ని కూడా లాగారు. జూ.ఎన్టీఆర్ తో మాకు సంబంధం లేదు, ఆయనెవరో తెలియదని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు.

Dinner : సూర్యాస్తమయానికి ముందే రాత్రిభోజనం ఎందుకంటే?

తాను చేసిన వ్యాఖ్యలకు స్పందించాల్సింది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అని వర్ల చెప్పారు. జూ.ఎన్టీఆర్ తో సంబంధం లేకపోతే మరోసారి సినిమా తీయడానికి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని కొడాలి నాని, వల్లభనేని వంశీలను వర్ల రామయ్య ప్రశ్నించారు. గతంలో వారు ఎన్టీఆర్ తో అదుర్స్ అనే సినిమా తీశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో మాకు సంబంధం లేదు ఆయనెవరో తెలియదని అంటున్నారని మండిపడ్డారు. తాను జూ.ఎన్టీఆర్ కి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తానని, మీ అత్తయ్య సంతృప్తి చెందే విధంగా మీ స్పందన ఉండాలని తెలియజేస్తానని వర్ల రామయ్య అన్నారు.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు నిరసనగా వర్ల రామయ్య నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తన భార్యతో కలిసి తన నివాసంలో 12 గంటల నిరసనకు దిగారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించిన తీరు సరిగా లేదన్నారు వర్ల రామయ్య.

భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్‌ విఫలమయ్యారని ఆయన అన్నారు. మేనత్తను నొటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించ లేదని… ఈ విషయాన్ని ప్రజలే అనుకుంటున్నారని వర్ల రామయ్య చెప్పారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా? అని ప్రశ్నించారు. అటు బుద్దా వెంకన్న కూడా ఎన్టీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రిలాగానో, ఆది లాగానో స్పందిస్తాడనుకున్నామని… కానీ, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు చెప్పారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ స్పందన చూసి టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారని వాపోయారు.

Red Wine : రెడ్ వైన్ మహిళల్లో మధుమేహం రాకుండా చేస్తుందా?

వర్ల రామయ్య కామెంట్స్ పై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడం ఏమిటి..? జూనియర్ ఎన్టీఆర్ చెబితే మేమెందుకు వింటాము..? అంటూ ప్రశ్నలు కురిపించారు. నందమూరి కుటుంబం అంటే ముఖ్యమంత్రికి కూడా గౌరవం ఉందన్నారు. నందమూరి కుటుంబసభ్యులు అమాయకులు అని మంత్రి నాని అన్నారు. గొర్రె కసాయివాడినే నమ్ముతుందన్నట్టు.. నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబును నమ్ముతున్నారని కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ సీఎంగా ఉంటే పార్టీ నాశనమవుతుందని నాడు చంద్రబాబు చెబితే నమ్మేశారని నాని గుర్తు చేశారు.