42ఏళ్ల అనుభవంతో చెబుతున్నా.. పాలనంతా ఒక చోటే ఉండాలి : 3 రాజధానులపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ లో వెంకయ్యనాయుడు తన

  • Published By: veegamteam ,Published On : December 25, 2019 / 05:49 AM IST
42ఏళ్ల అనుభవంతో చెబుతున్నా.. పాలనంతా ఒక చోటే ఉండాలి : 3 రాజధానులపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ లో వెంకయ్యనాయుడు తన

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్ణభారత్ ట్రస్ట్ లో మీడియాతో చిట్ చాట్ లో వెంకయ్యనాయుడు తన అభిప్రాయాన్ని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణను ఆయన వ్యతిరేకించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండాలని అభిప్రాయపడ్డారు. సీఎం, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ అన్నీ ఒక్క చోట ఉండాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాను మొదటి నుంచి కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర సంస్థలను అన్ని ప్రాంతాల్లో పెట్టామని.. కేంద్ర మంత్రిగా ప్రత్యేక చొరవతో జిల్లాకో కేంద్ర సంస్థ వచ్చేలా చూశానని వెంకయ్య వెల్లడించారు. పాలనంతా ఒక్క చోట నుంచే ఉండాలన్నదే తన అభిప్రాయం అని స్పష్టం చేశారు.

42 ఏళ్ల రాజకీయ అనుభవంతో తాను ఈ మాటలు చెబుతున్నా అని వెంకయ్య అన్నారు. వివాదం కోసమో, రాజకీయ కోణంలోనో తన అభిప్రాయం చూడొద్దని కోరారు. మూడు రాజధానులపై ఒకవేళ కేంద్రం తనను అడిగితే.. ఇదే అభిప్రాయం చెబుతానని వెంకయ్యనాయుడు తేల్చి చెప్పారు.

వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. వెంకయ్య ప్రస్తుతం ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నారు. పరిపాలన వికేంద్రీకరణకు నేను వ్యతిరేకం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనిపై వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది చూడాలి.

మూడు రాజధానుల అంశంపై ఏపీలో దుమారం నడుస్తోంది. భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తే, కొందరు వ్యతిరేకిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. 8 రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు పార్టీల్లోనూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని నేతలు సైతం భిన్నంగా మాట్లాడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. విశాఖ జిల్లా టీడీపీ నేతలు మాత్రం వెల్ కమ్ చెప్పారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.

పరిపాలన వికేంద్రీకరణపై ఉపరాష్ట్రపతి కామెంట్స్:
* అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. పరిపాలన కేంద్రీకృతం కావాలి
* సీఎం, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒకే చోట ఉండాలి
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒక దగ్గరే ఉండాలి
* అది ఎక్కడా అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం
* అన్నీ ఒక చోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుంది
* 42 ఏళ్ల అనుభవంతో చెబుతున్నా
* అభివృద్ధి వికేంద్రీకరణకు మొదటి నుంచి కట్టుబడి ఉన్నా
* రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర సంస్థలను అన్ని ప్రాంతాల్లో పెట్టాం
* కేంద్ర మంత్రిగా ప్రత్యేక చొరవతో జిల్లాకో కేంద్ర సంస్థ వచ్చేలా చూశా
* పాలన ఒక్క చోట నుంచే ఉండాలనేది నా అభిప్రాయం
* వివాదం కోసమో, రాజకీయ కోణంలోనో నా అభిప్రాయం చూడొద్దు
* కేంద్రం అడిగితే ఇదే అభిప్రాయం చెబుతా