Andhra Pradesh : విశాఖలో మత్తు ఇంజక్షన్లు పట్టివేత
విశాఖపట్నంలో మత్తు ఇంజక్షన్లు అనధికారికంగా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

visakhapatnam drugs
Andhra Pradesh : విశాఖపట్నంలో మత్తు ఇంజక్షన్లు అనధికారికంగా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఖరగ్ పూర్ లో నిషేధిత మత్తు ఇంజక్షన్లను 1300 రూపాయలకు కొనుగోలు చేసి విశాఖపట్నంలో ఒక్కొక్కటి 6000 రూపాయలకు అమ్ముతున్నారు.
నగరంలోని లీలామహల్, భీమిలి ప్రాంతాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు బాక్సుల మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. సర్జరీ చేసే రోగులకు ఇచ్చే మత్తు ఇంజక్షన్లు వీరు యువతకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Hyderabad : సినీ నటిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్