Volunteer Fight: చీమకుర్తి మండలంలో మహిళతో వాగ్వాదానికి దిగి దాడి చేసిన వాలంటీర్: మహిళ మృతి

బొటనవేలి ముద్ర విషయంలో వాలంటీర్ కు మహిళకు మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసి చివరకు మహిళ మృతి చెందిన ఘటన చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడులో గురువారం వెలుగులోకి వచ్చింది

Volunteer Fight: చీమకుర్తి మండలంలో మహిళతో వాగ్వాదానికి దిగి దాడి చేసిన వాలంటీర్: మహిళ మృతి

Vol

Volunteer Fight: ప్రజలకు నేరుగా సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ప్రభుత్వం ఓ వైపు సేవా పురస్కారాలు అందిస్తుంటే..మరోవైపు కొందరు వాలంటీర్లు విచక్షణ మరిచి ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు. బొటనవేలి ముద్ర విషయంలో వాలంటీర్ కు మహిళకు మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసి చివరకు మహిళ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడులో గురువారం వెలుగులోకి వచ్చింది. ఎర్రగుడిపాడు గ్రామానికి చెందిన వాలంటీర్ కిరణ్..బయో మెట్రిక్(వేలిముద్ర) నిమిత్తం స్థానికంగా నివసిస్తున్న వరమ్మ అనే మహిళ ఇంటికి వెళ్ళాడు. పీఎం కిసాన్ యోజన పథకం కింద వేలి ముద్ర వేస్తె డబ్బులు పడతాయంటూ వాలెంటీర్ కిరణ్ చెప్పడంతో వరమ్మ తన వేలి ముద్రలు వేసింది.

Also read:Cheating in Tirumala: ప్రత్యేక దర్శన టికెట్లు అంటూ సర్వదర్శన టోకెన్లు అంటగట్టిన దళారీలు: తిరుమలలో కొత్త తరహా మోసం

పీఎం కిసాన్ డబ్బులు వస్తాయంటూ వరమ్మ గ్రామంలోని మిగతా మహిళలకు చెప్పింది. అయితే వేలి ముద్ర వేస్తే డబ్బులు ఇస్తానని ఎవరు చెప్పారంటూ వరమ్మపై వాలంటీర్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో వాలంటీర్ కిరణ్ తండ్రి సింగయ్య కూడా ఘర్షణలో తలదూర్చాడు. అనంతరం ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో వాలంటీర్ కిరణ్..వరమ్మను బలంగా వెనక్కు తోసేశాడు. కిందపడ్డ వరమ్మ తలకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు వరమ్మను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందింది. ఘటనపై వరమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వాలంటీర్ కిరణ్ అతని తండ్రి సింగయ్యను అదుపులోకి తీసుకున్నారు.

Also read:MIM Corporator: పోలీసులపై రెచ్చిపోయిన మరో మజ్లిస్ కార్పొరేటర్.. మీకు ఇక్కడేం పనిఅంటూ ఆగ్రహం

ఇదిలాఉంటే గ్రామంలో అమాయక ప్రజలను మోసం చేస్తూ తెలివిగా వేలి ముద్రలు తీసుకున్నవాలంటీర్ కిరణ్ పై గతంలోనూ ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చే నగదును కాజేసినట్టు స్థానికులు ఆరోపించారు. అక్రమంగా వేలి ముద్రలు సేకరించి ప్రజల ఫించన్ సొమ్మును అక్రమంగా దండుకుంటున్న వాలంటీర్ కిరణ్ ను, తన తల్లిని అన్యాయంగా చంపిన అతని తండ్రి సింగయ్యను కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి కుమారుడు, బంధువులు డిమాండ్ చేశారు. కాగా, ప్రజలకు నేరుగా సేవలు అందించేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన వాలంటీర్ల తీరుపై ఇటీవల ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తుండడం గమనార్హం.

Also read:AP New Districts : ఏపీలో కొత్త జిల్లాలకు కోడ్‌.. ఇక ఈ కోడ్ ద్వారానే కార్యక్రమాలన్నీ అమలు!