గుంటూరులో మహిళా వాలంటీర్ ఆత్మహత్య

గుంటూరు జిల్లా చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం

  • Published By: naveen ,Published On : June 1, 2020 / 10:04 AM IST
గుంటూరులో మహిళా వాలంటీర్ ఆత్మహత్య

గుంటూరు జిల్లా చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం

గుంటూరు జిల్లా చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ బాంధవి ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మరో వాలంటీర్ శ్రీనివాస్ తో ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకి కారణమని తెలుస్తోంది. తమ కుమార్తె ఆత్మహత్యకు వాలంటీర్ శ్రీనివాస్ వేధింపులే కారణమని మృతురాలి తండ్రి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాంధవి ఆత్మహత్యతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు వాలంటీర్ శ్రీనివాస్ పై దాడి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. 

ప్రేమ వ్యవహారమే కారణమా?
బాంధవి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబసభ్యులు చేసిన ఆరోపణల కోణంలో విచారణ చేపట్టారు. బాంధవి, శ్రీనివాస్ మధ్య ప్రేమ వ్యవహారం ఉందా? శ్రీనివాస్‌ ఆమెను వేధించాడా? ఇలా అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే కొన్ని చోట్ల ఈ వ్యవస్థ దారి తప్పుతోంది. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు అడ్డదారి తొక్కుతున్నారు.

వాలంటీర్ వేధింపులతో మాజీ మంత్రి కారు డ్రైవర్ ఆత్మహత్య..?
గ్రామ వాలంటీర్ వేధింపులతో రెండు రోజుల క్రితం విశాఖ జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇంటి నిర్మాణానికి అడ్డుపడటంతో తట్టుకోలేకపోయిన సన్యాసి నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు జరిగిన అన్యాయం గురించి వీడియోలో రికార్డ్ చేసి సూసైడ్ చేసుకున్నాడు. మరికొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు అధికార దుర్వినియోగానికి, అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. లబ్దిదారుల సొమ్మును కాజేసిన ఘటనలూ ఉన్నాయి.

Read: ప్రేమ పేరుతో యువతిని గర్భవతిని చేసిన పాస్టర్