మీ మామ ఎన్టీఆర్ దే కాదు.. మా మేనత్తది కూడా ఇదే ఊరు : చంద్రబాబుకి జగన్ కౌంటర్

  • Published By: veegamteam ,Published On : January 21, 2020 / 04:29 AM IST
మీ మామ ఎన్టీఆర్ దే కాదు.. మా మేనత్తది కూడా ఇదే ఊరు : చంద్రబాబుకి జగన్ కౌంటర్

మూడు రాజధానులపై ఏపీ అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు నేను అన్యాయం చేశానని చంద్రబాబు అంటున్నారు.. కానీ అందులో వాస్తవం లేదని జగన్ అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మామ ఎన్టీ రామారావు పేరుని జగన్ ప్రస్తావించారు.

చంద్రబాబుకి పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ది కృష్ణా జిల్లా నిమ్మకూరు అని గుర్తు చేసిన జగన్.. మా మేనత్తది కూడా ఇదే కృష్ణా జిల్లా అన్నారు. మా మేనత్తని కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరానికి ఇచ్చామని జగన్ చెప్పారు. కృష్ణా జిల్లాతో తన కుటుంబానికి దశాబ్దాల అనుభవం ఉందన్నారు సీఎం జగన్. 

”మా కుటుంబానికి ఇక్కడే రాజీవ్ రాయ్ థియేటర్ ఉంది. కృష్ణా జిల్లాతో 4 దశాబ్దాల అనుబంధం ఉంది. ఇక్కడే థియేటర్లు ఉన్నాయి. మా కుటుంబంపై జిల్లా ప్రజలు అపారమైన ప్రేమ చూపించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 33 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. 29మంది మా పార్టీ మీదే గెలిచారు అని గర్వంగా చెబుతున్నా.. ఈ జిల్లాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు నా వారే.

నాలో మంచి ఉంది కాబట్టే ఈ రోజున వైసీపీ ఎమ్మెల్యే కాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కొంతమంది మూడు రాజధానులకు మద్దతిచ్చే పరిస్థితి ఉంది. అంటే నాలో ఉన్న మంచితనమే కారణం. ఎక్కడైనా.. రాజకీయాల్లో నిజాయితీ, చిత్తశుద్ధి, మంచి చేయాలనే ఆలోచన ఉండాలి. అలా ఉంటేనే మంచి చేయగలం” అని జగన్ అన్నారు.