YSR Rythu Bharosa : ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

మూడో విడత సొమ్ము రూ.1,036 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. 50లక్షల 58వేల 489 మంది అన్నదాతలకు రైతు భరోసాతో లబ్ది పొందారు.

YSR Rythu Bharosa : ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

Ysr Rythu Bharosa

YSR Rythu Bharosa : ఏపీ సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి మూడో విడత నిధులను విడుదల చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం గత మూడేళ్లుగా అమలవుతోంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల సొమ్మును రైతుల ఖాతాలో జమ చేశారు. తాజాగా మూడో విడత సొమ్ము రూ.1,036 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. 50లక్షల 58వేల 489 మంది అన్నదాతలకు రైతు భరోసాతో లబ్ది చేకూరింది.

రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఈ నిధులు ఇస్తోంది. గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందించింది. వైఎస్ఆర్ రైతుభరోసా – పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది ప్రభుత్వం.

Fenugreek Seeds : చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గించే మెంతులు

మూడో విడతలో 48,86,361 మంది భూ యజమానులకు పీఎం కిసాన్‌ కింద రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్, కౌలుదారులకు రూ.2వేల చొప్పున రైతుభరోసా కింద రూ.30.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. కొత్తగా సాగుహక్కు పత్రాలు (సీసీఆర్‌సీ) పొందిన 21,140 మంది కౌలుదారులకు రైతు భరోసా కింద ఒకే విడతగా రూ.13,500 చొప్పున రూ.28.53 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.

మూడు విడతలు కలిపి 2021-22లో రూ.6,899.67 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లు అవుతుంది. సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించారు. 2019 అక్టోబర్‌ 15న శ్రీకారం చుట్టిన ఈ పథకం కింద తొలి ఏడాది 45 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,162.45 కోట్లు జమ చేశారు. ఈ మొత్తంలో పీఎం కిసాన్‌ కింద రూ.2,525 కోట్లు కేంద్రం, వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.3,637.45 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించాయి. ఇక రెండో ఏడాది 2020-21లో 49.40 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,750.67 కోట్లు జమచేశారు. ఇందులో వైఎస్సార్‌ రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.3,784.67 కోట్లు జమచేయగా, పీఎం కిసాన్‌ కింద రూ.2,966 కోట్లు కేంద్రం అందించింది.

New Year Amazon Deal: రూ.65వేల OnePlus 9Pro 5G ఫోన్ 30వేలకే!

వైసీపీ ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 13,500 పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా అందిస్తోంది. ఇందులో మొదటి విడతగా ఖరీఫ్‌ పంట వేసే ముందు అంటే మే నెలలో రూ. 7,500, రెండవ విడతగా అక్టోబర్‌ నెల ముగిసేలోపే ఖరీఫ్‌ పంట కోత సమయం, రబీ అవసరాల కోసం రూ. 4వేలు.. మూడవ విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరి నెలలో రూ. 2వేలు చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది.