YS Viveka Murder Case : అవినాశ్‌రెడ్డి లాయర్ ను కార్యాలయం బయటే ఆపివేసిన సీబీఐ అధికారులు..

వైఎస్ వివేకా హత్య కేసులో తన విచారణ పారదర్శకంగా ఉండాలని అవినాశ్ రెడ్డి సీబీఐకు రాసిన లేఖలో కోరారు. తనతో పాటు తన లాయర్ ను కూడా విచారణ సమయంలో అనుమతించాలన్న అవినాశ్ కోరారు. తన లాయర్ ను సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు అవినాశ్ రెడ్డి. కానీ అవినాశ్ లాయర్ ను సీబీఐ అధికారులు తిరస్కరించారు. అవినాశ్ లాయర్ ను కార్యాలయం బయటే ఆపేశారు.

YS Viveka Murder Case : అవినాశ్‌రెడ్డి లాయర్ ను కార్యాలయం బయటే ఆపివేసిన సీబీఐ అధికారులు..

YS Viveka Murder Case

Updated On : January 28, 2023 / 5:36 PM IST

YS Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారిస్తోంది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఢిల్లీనుంచి వచ్చిన సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ తో కూడిన నలుగురు అధికారుల బృందం ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. అవినాశ్ రెడ్డి స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. రెండు మూడు గంటల నుంచి వరుస ప్రశ్నలతో విచారిస్తున్న సీబీఐ బృందం విచారణ సాయంత్రం వరకు కొనసాగునున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు విచారణ ముగిసిన తర్వాత అవసరమైతే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.

YS Viveka Murder Case : సీబీఐ విచారణకు వెళ్తూ .. వైఎస్ విజయలక్ష్మితో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి భేటీ

కాగా వైఎస్ వివేకా హత్య కేసులో తన విచారణ పారదర్శకంగా ఉండాలని అవినాశ్ రెడ్డి సీబీఐకు రాసిన లేఖలో కోరారు. తనతో పాటు తన లాయర్ ను కూడా విచారణ సమయంలో అనుమతించాలన్న అవినాశ్ కోరారు. తన లాయర్ ను సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు అవినాశ్ రెడ్డి. కానీ అవినాశ్ లాయర్ ను సీబీఐ అధికారులు తిరస్కరించారు. అవినాశ్ లాయర్ ను కార్యాలయం బయటే ఆపేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాశ్ నేరుగా లోపలకు వెళ్లిపోయారు. అవినాశ్ రెడ్డిని విచారిస్తున్న సమయంలో పోలీసులు సీబీఐ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. అవినాశ్ ను విచారణ జరుగుతుందని ముందే అక్కడకు చేరుకున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అక్కడి నుం‌చి పంపించేశారు.

YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో ఎర్రగంగిరెడ్డితో పాటు ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు..విచారణకు హాజరుకావాలంటూ ఆదేశం

కాగా..వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ కోర్టు ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఎర్రగంగిరెడ్డితో పాటు ఐదుగురు నిందితులను సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వివేకా హత్య కేసుకు సీబీఐ కోర్టు SC/01/2023 నంబరు కేటాయించింది. సంబంధించిన ప్రధాన ఛార్జ్ షీట్, అనుబంధ చార్జ్ షీట్ లను విచారణకు స్వీకరించింది. ఐదుగురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, శివశంకర్ రెడ్డిలకు సమన్లను జారీ చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.