YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో ఎర్రగంగిరెడ్డితో పాటు ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు..విచారణకు హాజరుకావాలంటూ ఆదేశం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ కోర్టు ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఎర్రగంగిరెడ్డితో పాటు ఐదుగురు నిందితులను సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.

YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో ఎర్రగంగిరెడ్డితో పాటు ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు..విచారణకు హాజరుకావాలంటూ ఆదేశం

YS Viveka Murder Case

YS Viveka Murder Case : మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ కోర్టు ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఎర్రగంగిరెడ్డితో పాటు ఐదుగురు నిందితులను సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వివేకా హత్య కేసుకు సీబీఐ కోర్టు SC/01/2023 నంబరు కేటాయించింది. సంబంధించిన ప్రధాన ఛార్జ్ షీట్, అనుబంధ చార్జ్ షీట్ లను విచారణకు స్వీకరించింది. ఐదుగురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, శివశంకర్ రెడ్డిలకు సమన్లను జారీ చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.

కాగా..ఏపీలో పెను సంచలనం కలిగించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు సీబీఐ చేతికి వచ్చాక దర్యాప్తే వేగవంతమైంది. ఈ కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు తరలించాలని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతకుముంది సునీత ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేయటంతో సీబీఐ చేతికి ఈ కేసు చేరింది. అప్పటినుంచి విచారణ వేగవంతమైంది.

YS Viveka Murder Case : సీబీఐ విచారణకు వెళ్తూ .. వైఎస్ విజయలక్ష్మితో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి భేటీ

ఈక్రమంలో ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు చేసింది. దీంతో అవినాశ్ రెడ్డి తనకు ముందుగానే ఖరారు అయిన కార్యక్రమాలు ఉన్నాయని కాబట్టి ఐదు రోజుల తరువాత విచారణకు హాజరు అవుతానంటూ వివరిస్తూ సీబీఐకు లేఖ రాశారు. కానీ సీబీఐ అంత సమయం లేదు వీలైనంత త్వరంగా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేస్తూ మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో అవినాశ్ రెడ్డి ఈరోజు అంటే జనవరి 28న హైదరాబాద్ లోని సీబీఐ విచారణకు హాజరయ్యారు. అవినాశ్ రెడ్డి స్టేట్ మెంట్ ను సీబీఐ రికార్డు చేయనుంది.

ఈ క్రమంలో ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, శివశంకర్ రెడ్డిలకు సమన్లను జారీ చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణ పారదర్శంగా సాగాలని కోరుతున్నానని.. ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించాలని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు. తనతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతివ్వాలని వెల్లడించారు.