YSRCP Rajya Sabha Candidates : రాజ్యసభకు వైసీపీ అభ్యర్థులు ఖరారు.. అభ్యర్థుల ఎంపికలో జగన్ స్ట్రాటజీ ఇదే

రాజ్యసభకు అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. నలుగురి పేర్లను అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో జగన్ వ్యూహాత్మకంగా..

YSRCP Rajya Sabha Candidates : రాజ్యసభకు వైసీపీ అభ్యర్థులు ఖరారు.. అభ్యర్థుల ఎంపికలో జగన్ స్ట్రాటజీ ఇదే

Cm Jagan Take Sensational Decision On Rajyasabha Seats One For R. Krishnaiah

YSRCP Rajya Sabha Candidates : ఉత్కంఠకు తెరపడింది. రాజ్యసభ అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. రాజ్యసభకు తన అభ్యర్థులను అధికార పార్టీ వైసీపీ ఖరారు చేసింది. నలుగురి పేర్లను అధికారికంగా ప్రకటించింది. వైసీపీ ప్రకటించిన వారిలో విజయసాయిరెడ్డి(వైసీపీ నేత), ఆర్ కృష్ణయ్య(బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు), నిరంజన్ రెడ్డి(సుప్రీంకోర్టు న్యాయవాది), బీద మస్తాన్ రావులు(నెల్లూరు వైసీపీ నేత) ఉన్నారు. ఈ మేరకు నలుగురు అభ్యర్థుల పేర్లను వైసీపీ అధికారికంగా ప్రకటించింది. వీరిని సీఎం జగన్ ఫైనల్ చేశారు. రాజ్యసభ అభ్యర్థులతో సమావేశమైన జగన్ వారికి అభినందనలు తెలిపారు. అలాగే పలు సూచనలు కూడా చేశారు.

ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు సీఎం జగన్. ఇక బీద మస్తాన్ రావుకు ఇచ్చిన హామీని జగన్ నిలుపుకున్నారు. మరోవైపు బీసీలను దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఛాన్స్ ఇచ్చారు జగన్. ఇక న్యాయవాది నిరంజన్ రెడ్డికి రాజ్యసభ అవకాశం ఇచ్చారు జగన్.(YSRCP Rajya Sabha Candidates)

Rajya Sabha : దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజ్యసభకి తెలంగాణ, ఆంధ్ర అనేది ఉండదన్నారాయన. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆర్ కృష్ణయ్యకి సీఎం జగన్ రాజ్యసభ అవకాశం ఇచ్చారని చెప్పారు. జాతీయ స్థాయిలో బీసీల వాయిస్ ని వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయవాది అన్న మంత్రి బొత్స.. ఆయనకి తెలంగాణ, ఆంధ్ర అనే బేధం లేదని స్పష్టం చేశారు.

మే 31వ తేదీ వరకు రాజ్యసభ నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. జూన్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. పోటీ లేకపోతే అదే రోజున విజేతల ప్రకటన ఉంటుంది.

రాజ్యసభ వైసీపీ అభ్యర్థుల ఖరారుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఆయన చెప్పారు. బలహీనవర్గాలకు పెద్దపీట వేయడమే పార్టీ విధానం అని అన్నారు. ఆర్ కృష్ణయ్య బీసీల కోసం నిలబడ్డారని సజ్జల అన్నారు. వైసీపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం దక్కిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

AP Politics : బీసీ ఓట్లే టార్గెట్ గా వైసీపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య రాజ్యసభ సీటు..!

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు సీట్లకు జూన్ లో ఎన్నిక జరగనుంది. ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది.

రాజ్యసభ ఎన్నికలకు మే 24న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31గా ఈసీ నిర్ణయించింది. జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.

 

 

YCP Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్