MLA Gopireddy Srinivasa Reddy : నాకు వార్నింగ్ ఇవ్వడానికి నువ్వెవరు? మనిషికి మూడో కన్ను ఉండదు-బాలకృష్ణకు వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్

బాలకృష్ణ విషయం తెలుసుకొని మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడి తర్వాత సారీ చెప్పటం బాలకృష్ణకు అలవాటుగా మారింది. పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకొని వార్నింగ్ లు ఇవ్వొద్దు. మనుషులకు రెండే కళ్లు ఉంటాయి, మూడో కన్ను ఉండదు.

MLA Gopireddy Srinivasa Reddy : నాకు వార్నింగ్ ఇవ్వడానికి నువ్వెవరు? మనిషికి మూడో కన్ను ఉండదు-బాలకృష్ణకు వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్

MLA Gopireddy Srinivasa Reddy : అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ నేత, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చాడని తనకు తెలిసిందన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. బాలకృష్ణ విషయం తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఏదో ఒకటి మాట్లాడి తర్వాత సారీ చెప్పటం బాలకృష్ణకు అలవాటుగా మారిందని విమర్శించారు.

”రామిరెడ్డి పేటలో ప్రభ కట్టారు. వైసీపీ అభిమానుల వద్ద నుండి చందాలు తీసుకొని భాస్కర్ రెడ్డి ప్రభ కట్టాడు. అయితే మద్యం సేవించి న్యూసెన్స్ చేసి ప్రభను కూడా కోటప్పకొండకు తీసుకెళ్ళలేదు. దీంతో స్థానికులు ఆ విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. దానిపై భాస్కర్ రెడ్డిని మందలించాను. అదీ జరిగిన విషయం. బాలకృష్ణ ఒక ఎమ్మెల్యే, టీడీపీ నేత. విషయం తెలుసుకొని మాట్లాడాలి” అని ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు.

Also Read..Hindupur Lok Sabha Constituency: పరిటాల ఫ్యామిలీ ఫామ్‌లోకి వస్తుందా.. వైసీపీ పట్టు నిలుపుకోగలదా?

అసలు.. నాకు వార్నింగ్ ఇవ్వడానికి బాలకృష్ణ ఎవరు? అని ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫైర్ అయ్యారు. బాలకృష్ణ తన వ్యక్తిత్వం దిగజార్చుకోవద్దని ఎమ్మెల్యే అన్నారు. ఏ చర్చకైనా సిద్ధమేనని తేల్చి చెప్పారు. పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకొని వార్నింగ్ లు ఇవ్వొద్దన్నారు. మర్యాదగా మాట్లాడాలని బాలకృష్ణకు హితవు చెప్పారు. మనుషులకు రెండే కళ్లు ఉంటాయి, మూడో కన్ను ఉండదు, వాస్తవాలు తెలుసుకొని బాలకృష్ణ మాట్లాడాలి అని ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు.

”నా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు బాలయ్య ఎవరు? ఆయన హీరో అయితే టీడీపీకి గొప్ప కానీ.. నాకు కాదు. బాలయ్య వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. బాలకృష్ణ ఎన్నోసార్లు తప్పుడు మాటలు మాట్లాడారు. ఏదో ఒకటి అనడం, తప్పైపోయిందని వెనక్కి తీసుకోవడం ఆయనకు అలవాటే. ఓ పనికిమాలిన వెధవకి వత్తాసు పలికి స్థాయి దిగజార్చుకోవద్దు. మనుషులకు మూడో కన్ను ఉండదు. బాలకృష్ణ కూడా ఒక మనిషే. సినిమాల్లో లాగా జీవితంలో నటించడం కుదరదు” అని బాలయ్యకు చురకలంటించారు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి.

అసలేం జరిగిందంటే..
నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. పొలిటీషియన్‌ పొలిటీషియన్‌గానే ఉండాలని.. నీచానికి దిగజారకూడదు అంటూ.. శ్రీనివాస్‌రెడ్డిని హెచ్చరించారు. బాలకృష్ణ పాట పెట్టిన వైసీపీ కార్యకర్త భాస్కర్‌ రెడ్డిని.. ఎమ్మెల్యే గోపిరెడ్డి వేధించినట్లు ఆరోపణల నేపథ్యంలో బాలకృష్ణ ఇలా తీవ్రంగా స్పందించారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని.. అన్ని పార్టీల వాళ్లు తన సినిమాలు చూస్తారన్నారు బాలకృష్ణ. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలంటూ హెచ్చరించారు. తెనాలి పెమ్మసాని థియేటర్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ వేదిక నుంచి వైసీపీ ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారు బాలయ్య.

Also Read..Anantapur Lok Sabha constituency: పవన్ కల్యాణ్‌ను పోటికి దించుతారా.. కొత్త ముఖాలేమైనా బరిలోకి దిగబోతున్నాయా?

నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో శివరాత్రికి జరిగిన కోటప్పకొండ తిరునాళ్లలో బాలయ్య సాంగ్ పెట్టి డ్యాన్స్ వేసినందుకు వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డిని.. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మందలించారని ఆరోపణలు ఉన్నాయి. దాంతో అతడు ఎమ్మెల్యే ఇంటిముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన బాలకృష్ణ.. ఎమ్మెల్యే పేరు చెప్పకుండానే ఆయనపై సీరియస్ అయ్యారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సినిమాను సినిమాగానే చూడాలన్నారు. ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే ఊరుకోనన్నారు.

‘మొన్న నరసరావు పేటలో చిన్న సంఘటన జరిగింది. బాలకృష్ణ పాట వేశారంటూ వాళ్ల కార్యకర్తనే ఇబ్బంది పెట్టారు. అంతకంటే మూర్ఖుడు ఇంకెవరైనా ఉంటారా. యథా రాజ తథా ప్రజా. స్థాయి దిగజార్చుకున్న ఆ వ్యక్తి పేరు నేను తీయను. ఇంకోసారి ఇలాంటిది జరిగితే మాత్రం ఊరుకోను. నేను చిటికేస్తే, మూడో కన్నుతెరిస్తే ఏమవుద్దో తెలుసుకుని మసలుకో. రాజకీయ నాయకుడిగా నాపైకి వస్తానంటే రండి. నేను రెడీ. కానీ, సినిమాల విషయానికి రావొద్దు. మీ పరిధిలో మీరు ఉండండి’ అని వైసీపీ ఎమ్మెల్యేకి మాస్ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య.