Home » Author »naveen
వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి కాసేపు స్టూడెంట్ గా మారారు. తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చుని టీచర్లు ఎలా బోధన చేస్తున్నారో పరిశీలించారు కలెక్టర్ గోపీ.
పీఎం శ్రీ స్కూల్స్ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14వేల పీఎం శ్రీ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తద్వారా 18లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం భావిస్తోంది.
రామచంద్ర పిళ్లై కుటుంబంతో కవిత కుటుంబం ఉన్న ఫొటో బయటకు రావడంతో రాజకీయ కలకలం చెలరేగింది. తాజా సోదాల ఆధారంగా కొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
లిక్కర్ స్కామ్ కేసు నిందితులతో ఎమ్మెల్సీ కవిత ఫొటో బయటకు రావడంపై రాజకీయ దుమారం చెలరేగింది. రామచంద్ర పిళ్లై కుటుంబంతో కవిత కుటుంబం తిరుపతి వెళ్లింది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 337 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 30వేల 222 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,004కి తగ్గింది.
ఆసియా కప్ టీ20 టోర్నీలో ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ చేతులెత్తేసింది. శ్రీలంకతో జరిగిన కీలక పోరులో భారత ఓటమిపాలైంది. భారత్ పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కాకినాడ కేంద్రీయ విద్యాలయ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రధానంగా మూడు విషయాలపై తాము దృష్టి సారించినట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీర తెలిపారు.
వార్డెన్ జ్యోతి సస్పెన్షన్ ను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మా వార్డెన్ మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు. మీరు లేని హాస్టల్ మాకొద్దు అంటూ విద్యార్థులు కన్నీటిపర్యంతం అయ్యారు.
ఆసియా కప్ లో తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించలేకపోయారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులే చేసింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళ అయ్యింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి బుధవారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
విద్యార్థులకు బల్లి పడిన అన్నం పెట్టిన ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ జ్యోతిపై సస్పెన్షన్ వేటు వేశారు.
వర్ధన్నపేట ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు.
ఈ కాల్పులకు అసలు కారణం ఆర్థిక లావాదేవీలా? వ్యక్తిగత కక్షలా? అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. వ్యాపార ఆధిపత్యమా? అంతర్గత వ్యవహారాలా? వివాహేతర సంబంధమా? అనే విషయాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసు యంత్రాంగం ఉంది.
నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. సంగం, నెల్లూరు బ్యారేజీలను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం వాటిని జాతికి అంకితం చేశారు.
కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ మహిళా నేతలు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది.
హాస్టల్ సిబ్బంది బాలికలకు బల్లి పడిన ఆహారం వడ్డించారు. దీంతో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
కరీంనగర్ లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే భారీ చోరీకి పాల్పడ్డారు. పక్కాగా రెక్కీ నిర్వహించిన దొంగలు.. వెంటాడి మరీ రూ.15 లక్షలు దోచుకెళ్లారు.
పేదలు మంచి చదువులు చదవాలన్నదే సంస్కరణల లక్ష్యం అన్న జగన్.. అందుకోసమే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని వివరించారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తమకు లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
విశాఖలో కలకలం రేగింది. భారీగా మత్తు ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. కంచరపాలెం ముఠాకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 8వేల మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
బిగ్ బాస్ రియాల్టీ షో కాదని దరిద్రపు బూతు షో అని ఆయన అన్నారు. బిగ్ బాస్ షో తో సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదన్న నారాయణ.. యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.