Home » Author »naveen
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి బ్రహ్మోత్సవాలు భక్తుల సమక్షంలోనే జరగనున్నాయి.
మృత్యువు ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు, చెప్పలేరు. అప్పటివరకు బాగున్న మనిషి సడెన్ గా కన్నుమూయచ్చు. రెప్పపాటులో ప్రాణం గాల్లో కలిసిపోవచ్చు. ఉత్తరప్రదేశ్ లోని బారెల్లీలో అలాంటి షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారా? అసెంబ్లీని రద్దు చేస్తారా? సీఎం పీఠాన్ని కేటీఆర్ కు అప్పగిస్తారా?
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 34వేల 814 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 29వేల 410 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,293కి తగ్గింది.
బడా డ్రగ్ మాఫియా డాన్ నరేంద్ర ఆర్యను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డార్క్ వెబ్ లో వివిధ యాప్స్ ద్వారా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు నరేంద్రను పట్టుకునేందుకు గోవా వెళ్లి చాలా రిస్క్ తీసుకున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ నుంచి గూడూరు వైపు వస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న పాడుబడ్డ వ్యవసాయ బావిలోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఖమ్మం టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మినేని కోటేశ్వర్ రావు ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. కృష్ణయ్య హత్య కేసులో కోటేశ్వర్ రావు పై ఆరోపణలు రాగా, అప్పటినుంచి ఆయన పరారీలో ఉన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను బట్టే పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఫేస్ రికగ్నిషన్ యాప్ అటెండెన్స్ వివాదాలపై ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు సఫలం అయ్యాయి. దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. ప్రధానంగా ఫేస్ యాప్ పైనే చర్చ జరిగింది.
సెక్యూరిటీ గార్డులే వాడి టార్గెట్.. సుత్తి, రాళ్లే ఆయుధాలు.. మూడు రాత్రుల్లో మూడు హత్యలు.. మధ్యప్రదేశ్ లోని సాగర్ నగరంలో వరుస హత్యలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 34వేల 637 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 29వేల 120 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,406కి తగ్గింది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు.
మీ పిల్లల పేరుతో మీ ఇంటికి పార్సిల్స్ వస్తున్నాయా? మీకు తెలియకుండా వాటిని సీక్రెట్ గా ఓపెన్ చేస్తున్నారా? ఒక్కసారిగా మీ పిల్లల ప్రవర్తనలో తేడాలు కనిపిస్తున్నాయా? ఎవరితోనూ అంటీముట్టనట్టుగా ఉంటూ పరధాన్యంలో కనిపిస్తున్నారా? అయితే.. పేరెంట్స్
సీఎం జగన్ ని కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలని కేసీఆర్కు సలహా ఇచ్చారు నారాయణ. బీజేపీ వ్యతిరేక కూటమిని కలిసినందుకు కేసీఆర్ను ఆయన అభినందించారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ నియంత్రణ క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేసింది.
జూనియర్ ఎన్టీఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎన్టీఆర్ కలవడంపై నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఓ మొసలి మరో మొసలిని పట్టి తినేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సిల్వర్ స్ప్రింగ్స్ స్టేట్ పార్క్ లో ఇది జరిగింది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 34వేల 333 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 28వేల 484 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,738కి తగ్గింది.
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు శాఖల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా 2వేల 910 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందులో గ్రూప్ 2 ఉద్యోగాలు 663 ఉన్నాయి. గ్రూప్ 3 ఉద్యోగాలు 1373 ఉన్నాయి.
భర్తతో పాటు అందరినీ తప్పుదోవ పట్టించి ప్రియుడితో పారిపోయిన సాయిప్రియ కేసులో కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు సాయిప్రియ తండ్రిపైనా కేసు బుక్ చేశారు.