Mahabubabad Road Accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు

మహబూబాబాద్ జిల్లాలో ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ నుంచి గూడూరు వైపు వస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న పాడుబడ్డ వ్యవసాయ బావిలోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Mahabubabad Road Accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు

Updated On : September 2, 2022 / 6:49 PM IST

Mahabubabad Road Accident : మహబూబాబాద్ జిల్లాలో ప్రమాదం జరిగింది. అతివేగం ప్రాణాల మీదకు తెచ్చింది. మహబూబాబాద్ నుంచి గూడూరు వైపు వస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న పాడుబడ్డ వ్యవసాయ బావిలోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

గూడూరు మండలం జగన్నాయకులగూడెం వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన స్థానికులు కారులో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వేగంగా దూసుకొచ్చిన కారు బావిలో పడటంతో పెద్ద శబ్దం వచ్చింది. ఆ చుట్టుపక్కల వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు, రైతు కూలీలు అక్కడికి వచ్చారు. వారి వచ్చి చూసే సరికి కారు పూర్తిగా బావిలోకి పడిపోయింది. గాయపడ్డ ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.