Tammineni Koteswara Rao : టీఆర్ఎస్ నేత హత్య కేసు.. ఖమ్మం కోర్టులో లొంగిపోయిన తమ్మినేని కోటేశ్వర్ రావు

ఖమ్మం టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మినేని కోటేశ్వర్ రావు ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. కృష్ణయ్య హత్య కేసులో కోటేశ్వర్ రావు పై ఆరోపణలు రాగా, అప్పటినుంచి ఆయన పరారీలో ఉన్నారు.

Tammineni Koteswara Rao : టీఆర్ఎస్ నేత హత్య కేసు.. ఖమ్మం కోర్టులో లొంగిపోయిన తమ్మినేని కోటేశ్వర్ రావు

Updated On : September 2, 2022 / 5:45 PM IST

Tammineni Koteswara Rao : ఖమ్మం టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మినేని కోటేశ్వర్ రావు ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. కృష్ణయ్య హత్య కేసులో కోటేశ్వర్ రావు పై ఆరోపణలు రాగా, అప్పటినుంచి ఆయన పరారీలో ఉన్నారు. మొదటి ప్రధాన సూత్రధారి అని అనుకున్నా ప్రస్తుతం ఏ9గా కోటేశ్వర్ రావు, ఏ10గా ఎల్లంపల్లి నాగయ్య పేర్లను చేర్చారు పోలీసులు.

కృష్ణయ్య హత్య కేసులో కోటేశ్వర్ రావుదే ప్రధాన పాత్ర అని కృష్ణయ్య కుటుంబసభ్యులు ఆరోపిస్తూ వస్తున్నారు. కోటేశ్వర్ రావుని కాపాడే ప్రయత్నం జరుగుతోందని కూడా అన్నారు. అటు లొంగిపోయిన నిందితులకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది ఖమ్మం కోర్టు.

TRS Leader Tammineni Krishnaiah Murder : టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య..తెల్దారుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

తెల్దారుపల్లి శివారులో కృష్ణయ్యను దుండగులు దారుణంగా నరికి చంపారు. రాజకీయ కక్షలే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణయ్య టీఆర్ఎస్‌లో చేరారు. తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా తమ్మినేని కృష్ణయ్య కొనసాగుతున్నారు. ఆగస్టు 15న ఉదయం తమ్మినేని కృష్ణయ్యను ఆయన వ్యక్తిగత సహాయకుడు ముత్తేశ్‌ బైక్‌పై తీసుకెళ్తుండగా దుండగులు దాడి చేశారు. తెల్దారుపల్లి శివారులో దారుణంగా నరికి చంపారు.

Tammineni Krishnaiah : టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

కృష్ణయ్య హత్యకు సీపీఎం నేతలే కారణమని ఆరోపిస్తూ.. అతడి అనుచరులు దాడికి దిగారు. సీపీఎం నేత తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై కృష్ణయ్య అనుచరుల దాడి చేశారు. కోటేశ్వరరావు ఇంట్లోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు.