Wardhannapet Food Poison : పిల్లలకు బల్లి పడిన ఆహారం పెట్టిన ఘటనలో ట్విస్ట్.. వార్డెన్‌కు మద్దతుగా విద్యార్థుల ఆందోళన

వార్డెన్ జ్యోతి సస్పెన్షన్ ను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మా వార్డెన్ మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు. మీరు లేని హాస్టల్ మాకొద్దు అంటూ విద్యార్థులు కన్నీటిపర్యంతం అయ్యారు.

Wardhannapet Food Poison : పిల్లలకు బల్లి పడిన ఆహారం పెట్టిన ఘటనలో ట్విస్ట్.. వార్డెన్‌కు మద్దతుగా విద్యార్థుల ఆందోళన

Updated On : September 6, 2022 / 10:21 PM IST

Wardhannapet Food Poison : వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో హాస్టల్ వార్డెన్ జ్యోతిని.. కలెక్టర్ గోపీ సస్పెండ్ చేశారు. అయితే, వార్డెన్ జ్యోతి సస్పెన్షన్ ను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మా వార్డెన్ మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు.

వార్డెన్ జ్యోతి బయటకు వెళ్తుంటే ఆమెను చుట్టుముట్టిన విద్యార్థులు కన్నీటిపర్యంతం అయ్యారు. మీతో పాటు మేము కూడా బయటకు వస్తామని వార్డెన్ జ్యోతిని స్టూడెంట్స్ అడ్డుకున్నారు. మీరు లేని హాస్టల్ మాకొద్దు అంటూ ఎమోషన్ అయ్యారు. ఆమె సర్దిచెప్పే ప్రయత్నం చేసినా పిల్లలు వినలేదు.

వార్డెన్ పై స్టూడెంట్స్ చూపిస్తున్న ప్రేమతో వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా చలించిపోయారు. పేరెంట్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అవసరమైతే వార్డెన్ కోసం ధర్నా చేస్తామని విద్యార్థులు చెప్పడం విశేషం. కాగా, ఆహారంలో బల్లి పడిన ఘటనలో వార్డెన్ జ్యోతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. బల్లి పడిన ఆహారం తినడంతో సుమారు 60మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్ధినులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. వెంటనే వారిని వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వరంగల్‌ ఎంజీఎంకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు. తాము భోజనం చేస్తున్న సమయంలో బల్లి కనిపించిందని, ఇదే విషయాన్ని వార్డెన్ కు చెప్పినా అదే భోజనాన్ని అందరికీ వడ్డించారని పిల్లలు వాపోయారు. భోజనం తిన్నప్పట్టి నుంచే అందరికీ వాంతులు అయ్యాయని, కళ్లు తిరిగాయని చెప్పారు.