AP Assembly Sessions : సభకు వేళాయె.. ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళ అయ్యింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి బుధవారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.

AP Assembly Sessions : సభకు వేళాయె.. ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

Updated On : September 6, 2022 / 9:05 PM IST

AP Assembly Sessions : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళ అయ్యింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి బుధవారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. ఏపీ కేబినెట్ సమావేశంలో సీపీఎస్ అంశంపైనా చర్చించే అవకాశం ఉంది.

ఇప్పటికే జీపీఎస్ అమలుపై ఒక నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం అందుకు సంబంధించిన జీవోలను సిద్ధం చేసింది. కేబినెట్ భేటీ అనంతరం ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ కానుంది. జీపీఎస్ కు అంగీకరించాల్సిందేనని ఉద్యోగ సంఘాలు ఒత్తిడి చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

గత నెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా వాయిదా వేశారు. వారం పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది.