విజయం సాధించబోతున్నాం…జో బైడెన్

  • Published By: venkaiahnaidu ,Published On : November 4, 2020 / 11:28 AM IST
విజయం సాధించబోతున్నాం…జో బైడెన్

Keep the faith guys, we are going to win this: joe biden అమెరికా ఎన్నికల్లో తమదే విజయం అని డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ సృష్టంచేశారు. నమ్మకం ఉంచండి…మనం విజయం సాధించబోతున్నాం అంటూ జో బైడెన్ తాజాగా ప్రకటించారు. ప్రతి ఒక్క బ్యాలెట్ లెక్కించేవరకు ఎలక్షన్ ముగియదని బైడెన్ తెలిపారు.



ఇప్పటివరకు డెమోక్రాట్ పార్టీ ఆధిక్యంలో ఉందని బైడెన్ తెలిపారు. దిలావేర్ నుంచి ఆయ‌న మాట్లాడుతూ.. ఇలా ర‌స‌వ‌త్త‌ర పోటీ ఉంటుంద‌ని మాకు ముందే తెలుసు అని, కానీ వ‌చ్చిన ఫ‌లితాల ప‌ట్ల మేం సంతోషంగా ఫీల‌వుతున్నామ‌ని, ఇది నిజంగా అద్భుత‌మ‌ని బైడెన్ అన్నారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే బాట‌లో ఉన్నామ‌న్నారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తేల్చేందుకు దేశం యావ‌త్తు చివ‌రి ఓటును లెక్కించే వ‌ర‌కు వేచి ఉండాల‌న్నారు. మ‌ద్ద‌తుదారులంతా సంయ‌మ‌నంతో ఉండాల‌ని ఆయ‌న కోరారు. ఫ‌లితాల‌పై విశ్వాసం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. తుది ఫ‌లితాలు అనుకూలంగా ఉంటాయ‌ని ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.
https://10tv.in/biden-vs-trump-us-presidential-election-2020/
మరోవైపు, కొద్దిసేపట్లో తాను కూడా ఓ ప్రకటన చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.



కాగా, ఇప్పటివరకు వెల్లడైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో 223 ఎలక్టోరల్ ఓట్లతో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్​ 174 ఎలక్టోరల్​ ఓట్లు సాధించారు. ఎక్కువ ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో కాలిఫోర్నియా(55), న్యూయార్క్‌(29),వర్జీనియా‍‌(13), వాషింగ్టన్‌(12)లో బైడెన్‌ విజయం సాధించారు. ఇక, కీలక రాష్ట్రం ఫ్లోరిడాలో జరిగిన హోరాహోరీ పోరులో ట్రంప్ విజయం సాధించారు.



అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అధ్యక్ష పీఠం దక్కాలంటే 270 ఓట్లు అవసరం.

కాగా, అమెరికా ఎన్నికల్లో భారత్​ సంతతికి చెందిన ప్రమీల జయపాల్ విజయం సాధించారు. డెమొక్రాట్ల తరఫున వరుసగా మూడోసారి ప్రతినిధుల సభకు ఆమె ఎన్నికయ్యారు.