Amazon Fresh: దేశంలోని 60కి పైగా నగరాలకు విస్తరిస్తున్న అమెజాన్ ఫ్రెష్

అమెజాన్ ఫ్రెష్, కస్టమర్లకు విస్తృతమైన శ్రేణిని, సాటిలేని విలువను, సౌకర్యాన్ని అందించే వన్ స్టాప్ ఆన్­లైన్ డెస్టినేషన్. మా కస్టమర్లకు సేవలు అందించేందుకు మేము నిబద్దులమైన ఉన్నాము. అంతే కాక, ‘ప్రతిరోజు’, ‘ప్రతీది’ అందించే స్టోర్ కావాలన్న సంకల్పం మాకు స్ఫూర్తిని ఇస్తుంటుంది

Amazon Fresh: దేశంలోని 60కి పైగా నగరాలకు విస్తరిస్తున్న అమెజాన్ ఫ్రెష్

Amazon Fresh: అమెజాన్ ఇండియా ఈ రోజు, భారతదేశవ్యాప్తంగా 60కి పైగా నగరాలకు తన పూర్తి బాస్కెట్ గ్రోసరీ సేవ అయిన అమెజాన్ ఫ్రెష్­ను విస్తరింపజేస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్ ఫ్రెష్ యాప్-ఇన్-యాప్ అనుభవం – పండ్లు, కూరగాయలు, శీతల ఉత్పత్తులు, సౌందర్య, శిశు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, పెంపుడు జంతువులక ఉత్పత్తులతో సహా ఇతర రోజువారి కిరాణా సామాగ్రులుతో సహా విస్తృత శ్రేణి గ్రోసరీ ఉత్పత్తులను – మీకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ నగరాల్లోని కస్టమర్లు అన్ని గ్రోసరీ ఉత్పత్తుల పై ఆకర్షణీయమైన వారాంతపు సేల్, ప్రతి నెల 1 నుండ 7వ తేదీ వరకు సూపర్ వాల్యూ డేస్, తమకు కావలసిన టైమ్ స్లాట్­లో డెలివరీని పొందే సౌకర్యం ద్వారా వాల్యూ ఆఫర్లను పొంది ఆనందించగలుగుతారు.

Altroz iCNG: టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ iCNG లాంచ్‌తో CNG మార్కెట్‌లో సంచలనం

అమెజాన్ ఫ్రెష్ హెచ్ శ్రీకాంత్ శ్రీ రామ్ మాట్లాడుతూ “అమెజాన్ ఫ్రెష్, కస్టమర్లకు విస్తృతమైన శ్రేణిని, సాటిలేని విలువను, సౌకర్యాన్ని అందించే వన్ స్టాప్ ఆన్­లైన్ డెస్టినేషన్. మా కస్టమర్లకు సేవలు అందించేందుకు మేము నిబద్దులమైన ఉన్నాము. అంతే కాక, ‘ప్రతిరోజు’, ‘ప్రతీది’ అందించే స్టోర్ కావాలన్న సంకల్పం మాకు స్ఫూర్తిని ఇస్తుంటుంది. మామిడిపండ్ల వంటి సీజనల్ ఉత్పత్తులకు ఈ సీజన్­లో వేసవికి కావలసిన ఉత్పత్తులకు మంచి డిమాండు ఉండటం మేము మనించాము. దేశవ్యాప్తంగా మా వినియోగదారులకు అత్యుత్తమమైన ఆన్­లైన్ షాపింగ్ అనుభవాన్ని కల్పించటం పై మేము మా దృష్టిని నిగిడ్చి ఉంచటం కొనసాగిస్తాము” అని అన్నారు.

iQOO Z7s 5G Launch : రూ. 20వేల లోపు ధరలో ఐక్యూ Z7s 5G ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. మరెన్నో ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!