IND vs SA : అతన్ని త్వరగా ఔట్ చేయకుంటే మాకు ఇబ్బందే.. అతనొక మ్యాచ్ విన్నర్.. సౌతాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ కీలక కామెంట్స్

Aiden Markram : సౌతాఫ్రికా జట్టు కెప్టెన్ మార్‌క్రమ్ మీడియాతో మాట్లాడాడు.. భారత జట్టులో అతడి వికెట్ మాకు ఎంతో కీలకమని పేర్కొన్నాడు.

IND vs SA : అతన్ని త్వరగా ఔట్ చేయకుంటే మాకు ఇబ్బందే.. అతనొక మ్యాచ్ విన్నర్.. సౌతాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ కీలక కామెంట్స్

south africa captain markram

Updated On : December 9, 2025 / 6:57 AM IST

IND vs SA T20 series : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య టెస్టు, వన్డే సిరీస్‌లు ముగిశాయి. టెస్టు సిరీస్‌ను సౌతాఫ్రికా జట్టు కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ప్రస్తుతం టీ20 సిరీస్ జరగనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మంగళవారం సాయంత్రం 7గంటలకు కటక్ వేదికగా జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా సౌతాఫ్రికా జట్టు కెప్టెన్ మార్‌క్రమ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత జట్టులో అతడి వికెట్ మాకు ఎంతో కీలకమని పేర్కొన్నాడు.

Also Read : IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు ఐసీసీ షాక్‌.. భారీ జ‌రిమానా..

మార్‌క్రమ్ మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్లు లేకపోవడం తమ జట్టుకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే, టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు బలంగా ఉంది. ముఖ్యంగా టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మను త్వరగా ఔట్ చేయకుంటే కొన్ని ఓవర్లలోనే విధ్వంసం సృష్టిస్తాడు. అభిషేక్ శర్మ మ్యాచ్ విన్నర్.. అతడి వికెట్ తమకు చాలా కీలకమైందని మార్‌క్రమ్ తెలిపాడు.

అభిషేక్ శర్మ, నేను ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కలిసి ఆడాము. అతను నిర్భయంగా ఆడతాడు. తొలి బంతి నుంచి దూకుడుగా బౌలర్లపై విరుచుకుపడతాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడటానికి స్వేచ్ఛ ఇవ్వడంతో అతను ఈ విధంగా ఆడుతున్నాడని అనిపిస్తోంది. నిస్సందేహంగా చెప్పొచ్చు.. అతని వికెట్ మాకు ఎంతో కీలకం.. అతన్ని త్వరగా ఔట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తామని మార్‌క్రమ్ చెప్పారు.

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..
♦ తొలి టీ20 – డిసెంబర్ 9 (కటక్)
♦ రెండో టీ20 – డిసెంబర్ 11 (ముల్లాన్‌పూర్)
♦ మూడో టీ20 – డిసెంబర్ 14 (ధర్మశాల)
♦ నాలుగో టీ20 – డిసెంబర్ 17 (లఖ్‌నవూ)
♦ ఐదో టీ20 – డిసెంబర్ 19 (అహ్మదాబాద్)