Amazon Exclusive Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 10 మొబైల్ ప్లాన్లతో ఫ్రీ ప్రైమ్ మెంబర్‌షిప్.. డేటా, ఓటీటీ బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Amazon Exclusive Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా పొందాలంటే ఏం చేయాలో తెలుసా? వెంటనే ఈ మొబైల్ రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోండి.

Amazon Exclusive Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 10 మొబైల్ ప్లాన్లతో ఫ్రీ ప్రైమ్ మెంబర్‌షిప్.. డేటా, ఓటీటీ బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Amazon’s exclusive sale 10 plans from Vodafone-Idea and Airtel that offer Prime membership free

Amazon Exclusive Sale : 2023 అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 15 నుంచి జూలై 16 వరకు కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనేది కంపెనీ ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేక వార్షిక సేల్ నిర్వహించేది. అయితే, అమెజాన్ ప్రైమ్ కంపెనీ పేమెంట్ సబ్‌స్ర్కిప్షన్. దీని ద్వారా వినియోగదారులకు అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. భారత ఓటీటీ మార్కెట్లో అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం నెలకు రూ. 179, ఏడాదికి రూ. 1499 నుంచి ప్రారంభమవుతుంది. విస్తృత శ్రేణి ప్రొడక్టులపై ఉచితంగా వేగవంతమైన డెలివరీ వంటి బెనిఫిట్స్ అందించడమే కాకుండా (Amazon Prime) సభ్యత్వం సభ్యులకు అమెజాన్ ప్రైమ్ వీడియో కంటెంట్ మరిన్నింటికి ఉచితంగా యాక్సస్ అందిస్తుంది.

ముఖ్యంగా, దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్‌టెల్ (Airtel), వోడాఫోన్ ఐడియా (Vodafone – idea) నుంచి కొన్ని ప్లాన్‌లు (Amazon Prime) మెంబర్‌షిప్ కాంప్లిమెంటరీని అందిస్తాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందించే ఎయిర్‌టెల్, వోడాఫోన్ నుంచి 10 ప్లాన్‌లను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ఎంచుకుని ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి. అమెజాన్ ప్రైమ్ సభ్యుత్వాన్ని ఉచితంగా పొందండి.. అమెజాన్ ప్రైమ్ ఫ్రీ మెంబర్‌షిప్ అందించే రీఛార్జ్ ప్లాన్లలపై ఓసారి లుక్కేయండి.

ఎయిర్‌టెల్ రూ. 999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ అందించే ఈ పోస్టుపెయిడ్ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ మెంబర్లు ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు. రోజుకు 100GB మొత్తం డేటాను పొందవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 100 SMSలు పంపుకోవచ్చు. 6 నెలల వరకు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉచితంగా పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
ఈ ఎయిర్‌టెల్ పోస్టుపెయిడ్ ప్లాన్ ద్వారా రోజుకు మొత్తం డేటా 75GB వరకు పొందవచ్చు. కాలింగ్ బెనిఫిట్స్ కోసం అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 100 SMS పంపుకోవచ్చు. 6 నెలల వరకు Amazon Prime సభ్యత్వాన్ని పొందవచ్చు.

Read Also : Best Smartphones India : రూ. 60వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే? తప్పక తెలుసుకోండి!

ఎయిర్‌టెల్ రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ కింద ఎయిర్‌టెల్ యూజర్లు మొత్తం 75GB డేటాను పొందవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 100 SMS పంపుకోవచ్చు. 6 నెలల వరకు Amazon Prime సభ్యత్వాన్ని పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 1199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ ద్వారా వినియోగదారులు 150GB మొత్తం డేటాను పొందవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 100 SMS పంపుకోవచ్చు. 6 నెలల వరకు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 1499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ కింద వినియోగదారులు 250GB మొత్తం డేటాను పొందవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS పంపుకోవచ్చు. 6 నెలల వరకు Amazon Prime సభ్యత్వాన్ని పొందవచ్చు.

వోడాఫోన్ ఐడియా రూ. 501 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా యూజర్లు ఈ డేటా ప్లాన్ కింద 90GB మొత్తం డేటాను పొందవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. మొత్తం 3వేల SMS పంపుకోవచ్చు. 6 నెలల వరకు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని పొందవచ్చు.

Amazon’s exclusive sale 10 plans from Vodafone-Idea and Airtel that offer Prime membership free

Amazon’s exclusive sale 10 plans from Vodafone-Idea and Airtel that offer Prime membership free

వోడాఫోన్ ఐడియా రూ. 701 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ కింద వోడాఫోన్ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, మొత్తంగా 3000 SMS పంపుకోవచ్చు. 6 నెలల వరకు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం పొందవచ్చు.

వోడాఫోన్ ఐడియా రూ. 1101 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ కింద యూజర్లు అన్‌లిమిటెడ్ డేటా పొందవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. 3000 SMS పొందవచ్చు. 6 నెలల వరకు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ కింద 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, STD కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 SMSలు పంపుకోవచ్చు. 84 రోజుల వరకు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ కింద ఎయిర్‌టెల్ యూజర్లు 56 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 3GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్ పొందవచ్చు. రోజుకు 100 SMS పంపుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ 56 రోజులు వరకు పొందవచ్చు.

Read Also : Reliance Digital India Sale : రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్.. జూలై 14 నుంచి అదిరే ఆఫర్లు.. రూ.10వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!