ATMలో విత్ డ్రా ఛార్జీల పెంపు ? 

  • Published By: madhu ,Published On : June 23, 2020 / 06:44 AM IST
ATMలో విత్ డ్రా ఛార్జీల పెంపు ? 

ఏటీఎం కార్డు దారులకు త్వరలో మరో షాక్ తగులబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి ట్రాన్సాక్షన్ కు విత్ డ్రాయల్ లిమిట్ పెంచే యోచనలో, ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎంలో విత్ డ్రా చేసేది కేవలం రూ. 5 వేలకు మాత్రమే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

RBI ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించింది. పలు రకాల ఛార్జీలను పెంచాలని భావిస్తున్నారు. ఏటీఎంలల్లో జరిపే అన్ని లావాదేవీలపై ఇంటర్ ఛేంజ్ ఛార్జీలను పెంచాలని ఆ కమిటీ సూచించినట్టు తెలుస్తోంది.

ఏటీఎం ఛార్జీలు 16 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షాన్స్‌కు రూ.17, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.7 చొప్పున ఏటీఎం ఛార్జీలు వసూలు చేయాలని కమిటీ తెలియచేసిందని తెలుస్తోంది. 

భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కేంద్రం పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో RBI కూడా పలు సంస్కరణలు చేపట్టింది. మారటోరియాన్ని మరో మూడు నెలలు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దేశ ఆర్థిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టింది ఆర్బీఐ. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి విస్తృతంగా విజృంభిస్తున్న సమయంలో డిజిటల్ ఆర్థిక..లావాదేవీలను ప్రోత్సాహించడానికి మూడు నెలల పాటు ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా నగదు ఉపసంహరించుకుంటే..ఎలాంటి ఛార్జీలు ఉండవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం ఏటీఎం విత్ డ్రా విషయంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయో చూడాలి. 

Read: బంగారం @రూ.50వేలు