Bank Loans : గడిచిన ఐదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల బకాయిలు రద్దు చేసిన బ్యాంకులు

గడిచిన ఐదేళ్ల కాలంలో దేశంలోని పలు బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది.

Bank Loans : గడిచిన ఐదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల బకాయిలు రద్దు చేసిన బ్యాంకులు
ad

Bank Loans : గడిచిన ఐదేళ్ల కాలంలో దేశంలోని పలు బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,36,265 కోట్లుండగా, 2021–22లో  రద్దైన మొండి బకాయిలు రూ.1,57,096 కోట్లకు తగ్గినట్లు వివరించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగత్‌ ఈ మేరకు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

ఆర్‌బీఐకి అందిన లెక్కల ప్రకారం గత నాలుగేళ్లలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సంఖ్య 10,306గా ఉందని ఆయన చెప్పారు. ఇందులో అగ్రభాగాన.. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌ రూ.7,110 కోట్లు, ఈరా ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ రూ.5,879 కోట్లు, కాన్‌కాస్ట్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ రూ.4,107 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని వెల్లడించారు.

Also Read : Errabelli Pradeep Rao : టీఆర్ఎస్‌కు షాక్..! మంత్రి ఎర్రబెల్లి సోదరుడి రాజీనామా?