స్టాక్ మార్కెట్ లో రక్త కన్నీరు…ఒక్కరోజే 15లక్షల కోట్ల సంపద ఆవిరి

  • Published By: venkaiahnaidu ,Published On : March 12, 2020 / 09:51 AM IST
స్టాక్ మార్కెట్ లో రక్త కన్నీరు…ఒక్కరోజే 15లక్షల కోట్ల సంపద ఆవిరి

స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం కొనసాగుతుంది. కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మార్చి-12,2020)మరో బ్లాక్ డే నమోదైంది.

ఈ ఒక్క రోజులోనే స్టాక్ మార్కెట్లకు 15లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. వరల్డ్ వైడ్ వైరస్ దెబ్బకి షేర్లు పాతాళానికి పడిపోయాయి. ఓపెనింగ్ నుంచే నష్టాలపాలవుతున్న మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 3వేలకు పాయింట్ల వరకు సెన్సెక్స్ నష్టపోగా,930పాయింట్ల నష్టంలో నిప్టీ ఉంది. అన్ని సపోర్ట్ లెవల్స్ ను నిఫ్టీ,సెన్సెక్స్ బ్రేక్ చేశాయి.

2008 తర్వాత ఇదే అతిపెద్ద పతనం. నిష్టీ ఇండెక్స్ షేర్లలో ఒక్కదానికీ లాభం లేదు. 2500 కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. బీఎస్ఈ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.126లక్షల కోట్లకి పడిపోయింది. రూపాయి విలువ కూడా భారీగా పతనమైంది. డాలర్ తో మారకపు విలువ రూ.74.50గా నమోదైంది.

గత 70రోజుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి1లక్షా 11వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. చరిత్రలోఎరుగని స్థాయిలకు ఐటీసీ,గెయిల్,హిందాల్కో,ఎస్ బీఐలకు నష్టం వచ్చింది. 500 కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్,యాపిల్,ఓఎన్ జీసీ షేర్లు 14శాతం పడిపోయాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లది కూడా ఇదే పరిస్థితి.

See Also | కొనేవాళ్లులేక 6వేల కోళ్లను పూడ్చేశారు