Gold Price in India : బంగారం కొనాలని అనుకొనే వారికి శుభవార్త

బంగారం కొనాలనుకొనే వారికి శుభవార్త.... కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న పసిడి ధర భారీగానే దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 47 వేల రూపాయలకు చేరింది.

Gold Price in India : బంగారం కొనాలని అనుకొనే వారికి శుభవార్త

Gold

Gold Price : బంగారం కొనాలనుకొనే వారికి శుభవార్త…. కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న పసిడి ధర భారీగానే దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 46 990 వేల రూపాయలకు చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర 47 వేల 742 రూపాయలుగా ముగిసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,890గా ఉంది. ప్రపంచ మార్కెట్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ తగ్గుదల కనిపించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) సెక్యూరిటీస్‌ వివరించింది. మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. కిలో వెండి 70 వేల 300 రూపాయలుగా ట్రేడ్‌ అవుతోంది.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుందన్న సంకేతాలకు తోడు డాలర్‌ విలువ మరింత బలపడటంతో పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం పడినట్టు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.
దేశంలో సాధారణ, మధ్యతరగతి ప్రజలు 22 క్యారెట్ల బంగారాన్నే ఎక్కువగా కొంటారు. నగల తయారీలో దీన్నే వాడతారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం 44 వేల 850 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 48 వేల 930 గా ఉంది.

చెన్నై రూ. 45,150 (24 క్యారెట్). రూ. 49, 250 ((24 క్యారెట్).

ముంబై రూ. 47,350(24 క్యారెట్). రూ. 48, 350

ఢిల్లీ రూ. 47,742(24 క్యారెట్). రూ. 50,890

కోల్ కతా రూ. 47,190(24 క్యారెట్). రూ. 49,890

బెంగళూరు రూ. 44,850(24 క్యారెట్).  రూ. 48,930

హైదరాబాద్ రూ. 44,850(24 క్యారెట్). రూ. 48,930

  కేరళ రూ. 44,850(24 క్యారెట్). రూ. 48,930