Gold Rates : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

శ్రావణ మాసం రావటంతో పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి.

Gold Rates : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Silver Price

Gold Rates :  శ్రావణ మాసం రావటంతో పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, రష్యా ఉక్రెయిన్ యుధ్దంతో పాటు శ్రావణమాసం కారణంగా బంగారంధరలు కొద్దిరోజులుగాపైపైకి ఎగబాకాయి. శనివారం కూడా రేట్లు పెరిగాయి. ఆదివారం మాత్రం స్వల్పంగా రేట్లు తగ్గుముఖం పట్టాయి.

ఫలితంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 110 తగ్గగా… 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 100 తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,870గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 47,550 గా ఉంది. ఇక ఇవాళ కిలో వెండిపై రూ.800 తగ్గగా… హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.63,000గా ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో చూస్తే
విజయవాడలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్స్ ధర రూ.47,550గా ఉండగా… 24 క్యారెట్స్ బంగారం ధర 51,870గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 63,000 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870గా ఉంది.

దేశంలోని ఇతర నగరాల్లో బంగారం,వెండి ధరలు ఒకసారి పరిశీలిస్తే….
చెన్నైలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.48,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,850గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,700 ఉండగా… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,036 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,600గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 వద్ద ఉంది.
ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 51,870గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,550 వద్ద కొనసాగుతోంది.