గూగుల్ గుడ్ న్యూస్ : న్యూస్ పబ్లిషర్స్ కు 5నెలలు యాడ్ సర్వీసింగ్ ఫీజు మాఫీ

  • Published By: venkaiahnaidu ,Published On : April 17, 2020 / 09:57 AM IST
గూగుల్ గుడ్ న్యూస్ : న్యూస్ పబ్లిషర్స్ కు  5నెలలు యాడ్ సర్వీసింగ్ ఫీజు మాఫీ

కరోనా కష్టకాలంలో తమ న్యూస్ పార్టనర్స్ ని ఆదుకునేందుకు గూగుల్ ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా న్యూష్ పబ్లిషర్స్ కి ఐదు నెలల పాటు యాడ్ సర్వీసింగ్ ఫీజు(ad serving fees)ను తమ యాడ్ మేనేజర్ లో వదులుకుంటున్నట్లు శుక్రవారం(ఏప్రిల్-17,2020)గూగుల్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది న్యూస్ పబ్లిషర్లు అడ్వర్టైజింగ్(ప్రకటనలు)తో తమ డిజిటల్ వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి గూగుల్ యాడ్ మేనేజర్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

ప్రపంచఆర్థికవ్యవస్థపై కరోనావైరస్ మహమ్మారి ప్రభావం పడిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా నిజమైన జర్నలిజాన్ని అందిస్తున్న న్యూస్ ఆర్గనైజేషన్లకు తక్షణ ఆర్థికమద్దతు అందించే మార్గాలను గుర్తించే పనిని గూగుల్ న్యూస్ ఆవిష్కరించినట్లు గ్లోబల్ పార్టనర్ షిప్స్-న్యూస్ డైరక్టర్ జాసన్ వాషింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. రాబోయే రోజుల్లో… ప్రోగ్రామ్ యొక్క వివరాల గురించి అవసరాలను తీర్చగల మా వార్తా భాగస్వాములను గుర్తిస్తాము మరియు వారి అకౌంట్ స్టేట్‌మెంట్లలో వారు ఏమి ఆశించవచ్చో తెలియజేస్తాము అని వాషింగ్ తెలిపారు.

అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వేలాది చిన్న,మధ్య,లోకల్ న్యూస్ పబ్లిషర్స్ కి అత్యవసర సాయం కోసం జర్నలిజం ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్ ను కూడా గూగుల్ ప్రకటించింది. ఈ సంక్షోభ సమయంలో స్థానిక కమ్యూనిటీల కోసం అసలైన వార్తలను ఉత్పత్తి చేసే వార్తా సంస్థలకు ఈ నిధులు తెరవబడతాయి. ఓ సింపుల్ అప్లికేషన్ ఫార్మ్ ద్వారా పబ్లిషర్లు ఫండ్స్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరితేదీ ఏప్రిల్-29.