Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్‌ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబ‌డులు

యూకె, దావోస్‌ పర్యటన విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన తన బృందానికి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 18 నుంచి 22 వరకు కేటీఆర్‌ లండన్‌లో పర్యటించారు.

Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్‌ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబ‌డులు

Ktr (1)

Updated On : May 28, 2022 / 8:06 AM IST

Minister KTR : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌.. విదేశీ పర్యటన సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. యూకే, దావోస్‌లో పది రోజులపాటు పర్యటించిన కేటీఆర్‌.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యారు. రాష్ట్రానికి కోట్ల విలువచేసే పెట్టుబడులను తీసుకొచ్చారు. యూకే, దావోస్‌ పర్యటనలో భాగంగా 45 వాణిజ్య, 4 రౌండ్‌ టేబుల్‌, 4 ప్యానెల్‌ సమావేశాల్లో పాల్గొన్నట్టు కేటీఆర్‌ ప్రకటించారు. మొత్తం తన పర్యటనలో 4వేల 200లకుపైగా పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్‌ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

యూకె, దావోస్‌ పర్యటన విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన తన బృందానికి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 18 నుంచి 22 వరకు కేటీఆర్‌ లండన్‌లో పర్యటించారు. లండన్‌లో భారత హైకమిషన్‌ సమావేశంతోపాటు ప్రవాస భారతీయులు, యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.

Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్‌ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద

లండన్‌ పర్యటన ముగించుకుని దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో ఆయన సమావేశం అయ్యారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. ప‌లు అంత‌ర్జాతీయ కంపెనీల‌తో మంత్రి కేటీఆర్ స‌మావేశ‌మై తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు.