Moto G14 Launch : రూ. 10వేల లోపు ధరకే మోటో G14 ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఆగస్టు 8 నుంచే సేల్..!

Moto G14 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మోటోరోలా ఇండియా నుంచి Moto G14 కొత్త ఫోన్ లాంచ్ చేసింది. 5,000mAh బ్యాటరీతో బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. ధర కేవలం రూ. 9,999 మాత్రమే..

Moto G14 Launch : రూ. 10వేల లోపు ధరకే మోటో G14 ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఆగస్టు 8 నుంచే సేల్..!

Motorola launches Moto G14 in India, price set under Rs 10,000

Moto G14 Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటోరోలా (Motorola) ఇటీవల భారత మార్కెట్లో Moto G14ను లాంచ్ చేసింది. సరసమైన ధరకే G-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ అందిస్తోంది. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ డివైజ్ 6.5-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేతో ఆడియోవిజువల్ ఎక్స్‌పీరియన్స్, పవర్‌ఫుల్ డాల్బీ అట్మోస్-ట్యూన్డ్ స్టీరియో స్పీకర్ సెటప్‌తో వస్తుంది.

అద్భుతమైన ఫోటోలతో పాటు వీడియోలను క్యాప్చర్ చేసేందుకు ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. భారీ 5,000mAh బ్యాటరీ, 20W TurboPower ఛార్జింగ్ సపోర్ట్‌తో, Moto G14 లాంగ్ లైఫ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 13తో రన్ అవుతోంది. మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు ఆండ్రాయిడ్ 14కి ఫ్యూచర్ అప్‌డేట్‌లను అందిస్తుంది. యూజర్లకు లేటెస్ట్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

మోటో G14 ధర ఎంతంటే? :
మోటో G14 G-సిరీస్‌లో సరికొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్‌గా భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఏకైక 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999గా ఉంటుంది. స్టీల్ గ్రే, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. కంపెనీ సమీప భవిష్యత్తులో వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో కొత్త బటర్ క్రీమ్, లేత లిలక్ కలర్ ఆప్షన్‌లను అందించాలని యోచిస్తోంది.

Read Also : Android Users Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. మీ పర్సనల్ డేటా డేంజర్‌లో.. ఈ ఫేక్ యాప్ వెంటనే డిలీట్ చేసేయండి..!

ఈ ఫోన్ భారత మార్కెట్లో ఆగస్టు 8న (మధ్యాహ్నం) 12 గంటలకు మొదటిసారిగా అమ్మకానికి వస్తుంది. కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్ లేదా రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. Flipkart కస్టమర్లు ICICI బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ. 500 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

మోటో G14 స్పెసిఫికేషన్‌లు :
Moto G14 అనేది డ్యూయల్ సిమ్ (నానో) స్మార్ట్‌ఫోన్, కంపెనీ My UX ఆప్టిమైజేషన్‌లతో Android 13లో రన్ అవుతుంది. 1,080 x 2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్, 405ppi పిక్సెల్ సాంద్రతతో 6.5-అంగుళాల ఫుల్-HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద, ఫోన్ 4GB LPDDR4X RAMతో ఆక్టా-కోర్ Unisoc T616 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది.

Motorola launches Moto G14 in India, price set under Rs 10,000

Motorola launches Moto G14 in India, price set under Rs 10,000

128GB ఇంటర్నల్ UFS2.2 స్టోరేజీని అందిస్తుంది. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 1TB వరకు విస్తరించవచ్చు. కెమెరా విభాగంలో Moto G14 క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో 50MP ప్రైమరీ కెమెరా, ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ (PDAF), మెరుగైన తక్కువ-కాంతి ఫోటోగ్రఫీకి f/1.8 ఎపర్చరును కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, f/2.4 ఎపర్చర్‌తో 2MP మాక్రో కెమెరా ఉంది.

కనెక్టివిటీ ఆప్షన్లలో 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS, A-GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 20W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. మోటోరోలా బాక్స్‌లో కస్టమైజడ్ ఛార్జర్‌ను అందిస్తుంది. Moto G14 కూడా స్ప్లాష్ నిరోధకతకు IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ ప్రొటెక్షన్ లేయర్ అందిస్తుంది. Moto G14 కొలతలు 161.46 x 73.82 x 7.99mm, బరువు 177గ్రాములు ఉంటుంది. Moto G14 ఫోన్ ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కెమెరాలు, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

Read Also : Flipkart Big Saving Days Sale : ఆగస్టు 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌.. ఐఫోన్ 14, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!