రిలయన్స్ దూకుడు  : రూ.10వేల కోట్ల లాభాలు 

  • Edited By: veegamteam , January 18, 2019 / 05:23 AM IST
రిలయన్స్ దూకుడు  : రూ.10వేల కోట్ల లాభాలు 

మంబై : ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ సారథ్యంలోని  రిలయన్స్‌ లాభాల దూకుడులో దూసుకుపోతోంది. ప్రజెంట్ ఫైనాన్స్ ఇయర్ లో అంచనాలు మించిన లాభాలతో దూసుకుపోతోంది. రిఫైనరీ మార్జిన్లు తగ్గినా.. పెట్రోకెమికల్, రిటైల్, టెలికం రంగాల ఊతంతో క్యూ3లో కంపెనీ నికర లాభం 8.8 శాతం వృద్ధితో రూ.10,251 కోట్లకు పెరిగింది. ఒక త్రైమాసికంలో రూ. 10,000 కోట్ల పైగా లాభం నమోదు చేసిన తొలి ప్రైవేట్‌ కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్ రికార్డు సృష్టించింది. గత మూడు నెలల ఫైనాన్స్ ఇయర్ లో రిలయన్స్‌ లాభం రూ. 9,420 కోట్లు కాగా..అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య ఆదాయం 56 శాతానికి మించిపోయింది. దీంతో రూ. 1,71,336 కోట్లకు చేరింది. క్యూ3లో రిలయన్స్‌ నికర లాభం సుమారు దాదాపు రూ. 9,648 కోట్ల స్థాయిలో ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేయగా ఆ అంచనాలను మించి లాభాల బాట పట్టింది రిలయన్స్ ఇండ్రస్ట్రీ.  

పెట్రోలియం ప్రొడక్ట్స్ రేట్స్ పెరిగినా..తగ్గినా..పలు సవాళ్లు విసిరినా..అన్నింటినీ తట్టుకుని..కష్టాలను దాటుకుని కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ3లో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించగలిగామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్..మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా చెప్పారు. ‘రిటైల్, జియో వ్యాపార విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. క్యూ3లో రిలయన్స్‌ క్యాఫ్ స్టాక్స్ కూడా రూ. 76,740 కోట్ల నుంచి రూ. 77,933 కోట్లకు పెరిగాయి. భారీ ఇన్వెస్టిమెంట్ ప్లాన్ కంప్లీట్ కావటంతో 2018 డిసెంబర్‌ 31 నాటికి మొత్తం రుణ భారం రూ. 2,74,381 కోట్లకు పెరిగింది. గతేడాది మార్చి 31 నాటికి ఇది రూ. 2,18,763. 

రిలయన్స్‌ పెట్రో కెమికల్‌ వ్యాపార విభాగం పన్నుకు ముందస్తు లాభం 43% పెరిగి రూ. 8,221 కోట్లుగా నమోదవ్వగా..రిఫైనింగ్‌ విభాగం ఆదాయాలు వరుసగా మూడవ నెలలో కాస్తంత తగ్గాయి. మార్జిన్ల తగ్గుదల కారణంగా 18% క్షీణించి రూ.5,055 కోట్లుగా నమోదైంది. పండుగ సీజన్‌ అమ్మకాలు, కొత్త స్టోర్స్‌ ఓపెనింగ్స్ వంటి  సానుకూల అంశాలతో రిలయన్స్‌ రిటైల్‌ విభాగం పన్నుకు ముందస్తు లాభాలు రెట్టింపై రూ.1,680 కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఈ లాభం రూ. 606 కోట్లుగా ఉంది. మరోవైపు ఆదాయం 89 శాతం పెరిగి రూ. 18,798 కోట్ల నుంచి రూ. 35,577 కోట్లకు పెరిగింది.