ఇన్‌స్టాగ్రామ్‌ లో కొత్త ఫీచర్ : బ్రాండ్ల ఉత్పత్తులు కొనుగోలు

ఎంచుకున్న బ్రాండ్ల ఉత్పత్తులు కొనుగోలు చేసుకునే ఒక షాపింగ్‌ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ జోడించింది.

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 06:17 AM IST
ఇన్‌స్టాగ్రామ్‌ లో కొత్త ఫీచర్ : బ్రాండ్ల ఉత్పత్తులు కొనుగోలు

ఎంచుకున్న బ్రాండ్ల ఉత్పత్తులు కొనుగోలు చేసుకునే ఒక షాపింగ్‌ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ జోడించింది.

అమెరికా : ఫేస్‌బుక్‌ సొంతమైన ఇన్‌స్టాగ్రామ్‌ ఈ కామర్స్‌ బిజినెస్‌లోకి అడుగు పెట్టింది. అత్యంత ప్రజాదారణ పొందిన ఈ కామర్స్‌ వ్యాపారం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది. ఎంచుకున్న బ్రాండ్ల ఉత్పత్తులు కొనుగోలు చేసుకునే ఒక షాపింగ్‌ ఫీచర్‌ను జోడించింది. ఈమేరకు సంస్థ మార్చి 19 మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది.  

బీటా వెర్షన్లో “చెక్అవుట్” బటన్ అమెరికాలో లాంచ్‌ చేశామని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. తద్వారా మీరు ఇష్టపడే ఉత్పత్తిని యాప్‌ ద్వారానే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. చెక్అవుట్ బటన్‌ను క్లిక్‌ చేసి, సైజ్‌, రంగు ఆప్షన్స్‌ ఎంచుకుని, చెల్లింపులు చేయవచ్చని పేర్కొంది. ముఖ్యంగా ఆడిడాస్, బుర్బెర్రీ, డియోర్, హెచ్‌ అండ్‌ ఎం, నైక్, ఆస్కార్ డి లా రెంటా, ప్రాడా, గ్లాసెస్ రీటైలర్ వార్బీ పార్కర్ లాంటి పరిమిత బ్రాండ్ల ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫాంలో జోడించినట్టు తెలిపింది.