Petrol Prices: నిత్యం పైపైకే: 15 రోజుల్లో 13 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ పై ఏకంగా రూ 9:30 పెంచాయి సంస్థలు. తాజా రేట్ల పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.104.61కి చేరుకోగా, డీజిల్ రూ. 95.87కి చేరుకుంది

Petrol Prices: నిత్యం పైపైకే: 15 రోజుల్లో 13 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol

Petrol Prices: దేశంలో నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడిపై పెను భారం మోపుతున్నాయి. అడ్డుఅదుపులేకుండా పెట్రోలియం సంస్థలు చమురు ధరలను పెంచేస్తూ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నాయి. దేశంలో గత రెండు వారాలుగా పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల్లో 13 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయంటే..ప్రభుత్వాలు ప్రజలపై ఎంత భారం వేస్తున్నాయో అర్ధం చేసుకోవాలి. మంగళవారం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ పై 91 పైసలు,డీజిల్ పై 87 పైసలు పెంచాయి పెట్రోలియం సంస్థలు.

Also Read:BJP: ఏడాదికి రూ.720 కోట్లు.. అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా బీజేపీ!

మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ పై ఏకంగా రూ 9:30 పెంచాయి సంస్థలు. తాజా రేట్ల పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.104.61కి చేరుకోగా, డీజిల్ రూ. 95.87కి చేరుకుంది. మంగళవారం నాటికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.118.59గా ఉండగా, డీజిల్ రూ. 104.62కి చేరింది. కాగా రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో..దేశీయంగానూ ధరలు పెంచుతున్నాయి సంస్థలు. దేశీయ అవసరాల్లో దాదాపు 85 శాతం చమురుని భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నసంగతి తెలిసిందే.

Also read:AP Govt: కొత్త జిల్లాల ఏర్పాటు.. రిజిస్రేషన్ చార్జీలు పెంచిన ప్రభుత్వం!