Reliance GAP Store : హైదరాబాద్‌లో ఫస్ట్ ఫ్రీ-స్టాండింగ్ రిలయన్స్ ‘గ్యాప్’ స్టోర్ వచ్చేసిందోచ్.. ఇక్కడ అన్నిరకాల బ్రాండ్లు లభించును..!
Reliance GAP Store : ప్రముఖ అమెరికన్ బ్రాండ్ (GAP) హైదరాబాద్‌లో ఫస్ట్ ఫ్రీస్టాండింగ్ స్టోర్‌ను లాంచ్ చేసింది. నగరంలోని శరత్ సిటీ మాల్‌లో రిలయన్స్ రిటైల్ (Reliance Retail) లిమిటెడ్‌తో కలిసి గ్యాప్ తన రెండో ఫ్రీ స్టాండింగ్ స్టోర్ ప్రారంభించినట్లు ప్రకటించింది.

Reliance GAP Store _ Reliance Retail opens first freestanding Gap Store in Hyderabad After Mumbai
Reliance GAP Store : ప్రముఖ అమెరికన్ బ్రాండ్ (GAP) హైదరాబాద్‌లో ఫస్ట్ ఫ్రీస్టాండింగ్ స్టోర్‌ను లాంచ్ చేసింది. నగరంలోని శరత్ సిటీ మాల్‌లో రిలయన్స్ రిటైల్ (Reliance Retail) లిమిటెడ్‌తో కలిసి గ్యాప్ తన రెండో ఫ్రీ స్టాండింగ్ స్టోర్ ప్రారంభించినట్లు ప్రకటించింది. దేశంలోనే మొట్టమొదటి ఫ్రీస్టాండింగ్ గ్యాప్ స్టోర్‌ను ముంబైలోని ఇన్ఫినిటీ మాల్, మలాడ్‌లో ప్రారంభించింది. రిలయన్స్ రిటైల్ భారత్‌లో అన్ని ఛానెల్‌లలో GAPకి అధికారిక రిటైలర్ భాగస్వామిగా ఉంది.
ఈ గ్యాప్ స్టోర్ ప్రారంభంతో రిలయన్స్ రిటైల్ గ్యాప్‌ఇంక్. మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యంలో సరికొత్త మైలురాయిని సూచిస్తుంది. రిలయన్స్ రిటైల్ భారత మార్కెట్లో అన్ని చోట్లా గ్యాప్ బ్రాండుకు అధికార రిటైలర్‌గా నిలువనుంది. గత ఏడాది నుంచి 50కి పైగా గ్యాప్‌షాప్-ఇన్-షాప్‌లు ప్రారంభించిన తర్వాత ముంబై ఇన్ఫినిటీ మాల్‌లో కొత్త గ్యాప్ స్టోర్ ప్రారంభమైంది.

Reliance GAP Store _ Reliance Retail opens first freestanding Gap Store in Hyderabad
రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రీస్టాండింగ్ స్టోర్లు :
గ్యాప్‌ఇంక్ అంతర్జాతీయ, గ్లోబల్ లైసెన్సింగ్, హోల్‌సేల్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ఆడ్రియెన్ గెర్నాండ్ మాట్లాడుతూ.. ‘రెండో దశలో భాగంగా హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో రెండో స్టోర్ ప్రారంభమైంది. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా మరికొన్ని ఫ్రీస్టాండింగ్ స్టోర్లను తెరిచే అవకాశం ఉంది. శరత్ సిటీ కేపిటల్ మాల్‌లోని గ్యాప్‌స్టోర్‌లో డెనిమ్, లోగో ప్రొడక్టులు ఉన్నాయి. మహిళలు, పురుషులు, పిల్లలు, శిశువులకు కావల్సిన అన్ని రకాల బ్రాండ్లు దొరుకుతాయి.
Read Also : Vivo V27 Series : వివో V27 సిరీస్ వచ్చేస్తోంది.. మార్చి 1నే లాంచ్.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?
భాగస్వాముల ఆధారిత పద్ధతి ద్వారా భారత్‌లో ఉనికిని విస్తరించడానికి రిలయన్స్ రిటైల్‌తో భాగస్వామ్యం కుదిరినందుకు చాలా సంతోషంగా ఉంది. గ్యాప్ బ్రిక్-అండ్-మోర్టార్ వ్యాపారం విస్తరిస్తోంది. ఈ ఫ్రీస్టాండింగ్ స్టోర్ల ప్రారంభంతో మల్టీ-బ్రాండ్ స్టోర్లతోను భారతీయ కస్టమర్లకు మరింత చేరువగా కానుంది.
ఎక్కడ షాపింగ్ చేస్తున్నారో అక్కడే వాళ్లను కలిసేందుకు వినియోగదారులకు వీలవుతుంది’ అని మేనేజింగ్ డైరెక్టర్ ఆడ్రియెన్ గెర్నాండ్ పేర్కొన్నారు. భారత్‌లో గ్యాప్‌స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ విభాగం ప్రెసిడెంట్, సీఈవో అఖిలేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఐకానిక్ బ్రాండ్ గ్యాప్‌ని కొత్త రూపంలో భారత్‌కు తీసుకురావడం ఆనందంగా ఉంది.

Reliance GAP Store : Reliance Retail opens first freestanding Gap Store in Hyderabad
కొత్త గ్యాప్‌స్టోర్లను విజిట్ చేసినప్పుడు.. వినియోగదారులు సరికొత్త రిటైల్ ఐడెంటినీ పొందడమే కాకుండా స్మార్ట్ ట్రయల్ రూమ్స్, ఎక్స్‌ప్రెస్ చెక్-అవుట్, మంచి ధర విలువతో సహా సాంకేతిక-ఆధారిత షాపింగ్ అనుభవాన్ని పొందుతారు. భారత్‌లో గ్యాప్ దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికకు ఫ్రీస్టాండింగ్ స్టోర్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
భారతీయ వినియోగదారులకు ప్రపంచ స్థాయి బ్రాండ్లను, వైవిధ్యమైన షాపింగ్ అనుభవాన్ని పొందడానికి మరొక అవకాశాన్ని ఇస్తుంది’ అని చెప్పారు. హైదరాబాద్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో రిలయన్స్ రిటైల్ గ్యాప్ స్టోర్ ప్రారంభమైన సందర్భంగా సినీనటి అనుపమ పరమేశ్వరన్ పలు రకాల బ్రాండ్లను చూస్తూ సందడి చేశారు.
అన్ని రోజులు స్టోర్ తెరిచే ఉంటుంది.. :
1969లో శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించిన గ్యాప్… డెనిమ్ ఆధారంగా వారసత్వాన్ని నిర్మిస్తూనే ఉందన్నారు. ఆన్‌లైన్‌లో ప్రపంచవ్యాప్తంగా కంపెనీ నిర్వహించే ఫ్రాంచైజ్ రిటైల్ ప్రదేశాలలో కస్టమర్లతో కనెక్ట్ అవుతుంది. హైదరాబాద్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఉన్న గ్యాప్‌స్టోర్ శనివారం (ఈ రోజు) సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభమైంది. సోమవారం నుంచి ఆదివారం వరకు రోజూ ఉదయం 11:00 నుంచి రాత్రి 9:30 వరకు ఈ స్టోర్ తెరిచే ఉంటుంది. గ్యాప్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీల్లో కస్టమర్లు, అభిమానులు @gapindia బ్రాండుతో మమేకం కావచ్చు.