Work From Office: ఉద్యోగులను క్రమంగా ఆఫీసులకు తీసుకొచ్చే పనిలో టెక్ సంస్థలు

టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్ వంటి టెక్నాలజీ కంపెనీలు "ఇంటి నుండి పని" విధానానికి స్వస్తి చెప్పి ఉద్యోగులకు హైబ్రిడ్ విధానంలో కార్యాలయం నుంచే పనిచేసే వెసులుబాటు

Work From Office: ఉద్యోగులను క్రమంగా ఆఫీసులకు తీసుకొచ్చే పనిలో టెక్ సంస్థలు

Tcs

Work From Office: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 పరిస్థితులు మెరుగుపడి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో..ప్రభుత్వాలు కరోనా ఆంక్షలు ఎత్తివేస్తున్నాయి. దీంతో భారత్ సహా పలు దేశాల్లో క్రమంగా కోవిడ్ ముందు స్థితి నెలకొంటుంది. ఈక్రమంలో పలు ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. భారత్ లో ప్రధాన ఐటి సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్ వంటి టెక్నాలజీ కంపెనీలు “ఇంటి నుండి పని” విధానానికి స్వస్తి చెప్పి ఉద్యోగులకు హైబ్రిడ్ విధానంలో కార్యాలయం నుంచే పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఈ హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులు రిమోట్ గా మరియు ఆఫీసులో పనిచేస్తూ రెండింటిలోనూ సమయాన్ని గడపడానికి ఎంచుకువచ్చు. టెక్ దిగ్గజం టీసీఎస్ ఇప్పటికే 25X25 మోడల్ పని విధానాన్ని తీసుకొచ్చింది. దీంతోపాటు తమ ఉద్యోగుల కోసం “ఒకేషనల్ ఆపరేటింగ్ జోన్లు (OOZ), హాట్ డెస్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది.

Also read:Andra Pradesh : యాపిల్ ధరలతో పోటీపడుతున్న నిమ్మకాయలు! ధర వింటే గొంతెండిపోవాల్సిందే..!

“రాబోయే నెలల్లో మా ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు తీసుకువస్తాము. మా అసోసియేట్ లు తమ సంబంధిత ఆఫీసులకు తిరిగి వచ్చేలా మేం ఇప్పటికే ప్రోత్సహించడం ప్రారంభించాం. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఎగ్జిక్యూటివ్ లు ఇప్పటికే కార్యాలయాల నుంచి పనిచేయడం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కార్యాలయాల్లో కోవిడ్ -19 నిబంధనలు అనుసరిస్తున్నాము, ఉద్యోగులు కార్యాలయం నుంచే పని చేయడానికి కార్యాలయాలు చాలా సురక్షితంగా ఉన్నాయి” అంటూ టీసీఎస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Also read:PETROL PRICES INCREASED: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. పెట్రోల్ పై 45, డీజిల్ పై 43పైసలు పెంపు

ఏమిటీ ’25X25 మోడల్’:
ఈ మోడల్లో సంస్థలో పనిచేసే 25 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఏ సమయంలోనైనా కార్యాలయం నుండి పనిచేయాల్సిన అవసరం లేదని, ఉద్యోగులు పని గంటల్లో 25 శాతానికి మించి కార్యాలయంలో గడపాల్సిన అవసరం లేదని టీసీఎస్ కంపెనీ తెలిపింది. ఇంటి నుండి పనికి అలవాటు పడ్డ ఉద్యోగులను క్రమంగా ఆఫీసుకు వచ్చేందుకే ఈ 25/25 హైబ్రిడ్ విధానాన్ని తీసుకువచ్చినట్లు టీసీఎస్ వివరించింది. ఆఫీసులకు వచ్చి పని చేసేందుకు ఎక్కువమంది ఉద్యోగులు ఉత్సాహం కనబర్చుతున్నారని..ఈ హైబ్రిడ్ మోడల్ ఉద్యోగులకు మరింత ఫ్లెక్సిబుల్ గా ఉంటుందని టీసీఎస్ పేర్కొంది. ఆఫీసు నుంచి పనిచేసే విధానం ద్వారా ఉద్యోగులపై ఎటువంటి భారం లేకుండానే చెప్పుకోదగిన ఫలితాన్ని రాబట్టవచ్చని టీసీఎస్ తెలిపింది.

Also Read:Gold Silver Rates: దేశంలో స్థిరంగా 22 క్యారెట్ల బంగారం ధర, పడిపోయిన వెండి ధర