Road Accident 10 Died : గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. శనివారం తెల్లవారుజాము నవ్ సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి.

ROAD ACCIDENT
Road Accident 10 Died : గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. శనివారం తెల్లవారుజాము నవ్ సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న 8 మది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరుగడంతో బస్సు ఒక్కసారిగా గుండె పోటు రావడంతో అతను ఘటనాస్థలంలోనే మరణించారు.
మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో 30 మందికి గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Manipur: ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సులు ఢీ.. 15 మంది విద్యార్థులు మృతి
క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఉన్నవారందరూ సూరత్ లో జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ మహోత్సవ్ కు హాజరై తిరిగి స్వంత ఊళ్లకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.